Skip to main content

మోడీ తీసుకున్న టాప్ టెన్ సంచలన నిర్ణయాలు

ఆయనో మహోన్నత వ్యక్తి. ఆయన నామ స్మరణతో యావద్దేశం ఊగిపోతోంది. ఆయనో సమ్మోహన శక్తి. ప్రవాహంలా సాగే  ప్రసంగానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు. ఆయన చేసే ప్రతీ పని ఓ సంచలనమే. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని పదవికే వన్నె తెచ్చిన వజ్ర సంకల్పుడు. పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి నిర్ణయంలో తనదైన ముద్ర వేస్తూ ..  ప్రత్యేకత చాటుకుంటున్నారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో  అసమాన దౌత్య విజయాలను అందించడం  ఆయన చతురతకు నిదర్శనం. ఆయన పాలనలో తీసుకున్న సంచలనాత్మక విజయాలు మచ్చుకు ఓ పది. 


 


జమ్ము కశ్మీర్ పై  కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అయితే ఇది అందరూ అనుకున్నట్లు కొద్దిరోజుల్లో జరిగిన ప్రక్రియ ఎన్నటికీ  కాదు. ప్రతినిత్యం తుపాకుల మోతతో ..కంటి నిండా నిద్ర కరువైన జమ్ము కశ్మీర్ కు శాశ్వత పరిష్కారం కోసం బీజేపీ ఏనాడో ప్రతిన బూనింది. ఏక్‌ దేశ్‌ మే.. దో విధాన్‌, దో ప్రధాన్‌, ఔర్‌ దో నిశాన్‌ నహీ చలేగీ అని మాజీ ప్రధాని వాజపేయి నినదించారు. ఇది జనసంఘ్‌ కాలం నుంచి బీజేపీ  మౌలిక సిద్ధాంతం. 370 అధికరణపై బీజేపీ తొలినుంచి ఒకే పంథా అనుసరిస్తూ వస్తోంది. మోడీ పాలనలో భారతీయుల  చిరకాల స్వప్నం సాకారమైంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత జాతిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమే కాక ఆనందంలో ముంచెత్తింది.


1) మోడీ తీసుకున్న అనూహ్యమైన, సంచలనాత్మకమైన నిర్ణయాల్లో నోట్ల రద్దును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 2016 నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దుతో సంచలనం సృష్టించారు. 500, 1000  రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేశారు. నల్లధనం వెలికితీయడం, తీవ్రవాదాన్ని అరికట్టడం కోసం పెద్ద నోటన్లు రద్దు చేస్తున్నానని ఆయన ధైర్యంగా చెప్పి అమలు చేశారు. పాలనలో కఠిన లక్ష్యాలను నిర్దేశించుకున్న మోదీ సర్కార్ సంచలనాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. 


2) ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సంస్కరణలను వేగిరం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అంటూ సంవత్సరాలుగా అమలుకు నోచుకోని జీఎస్టీని మోదీ ప్రభుత్వం పట్టాలెక్కించి ఔరా అనిపించింది. మోదీ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలు నోరెళ్లబెట్టాయి. 

3) 2016 సెప్టెంబర్‌ 29 న ఉగ్రవాద స్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ హడలిపోయింది. భారత్ దాడులకు దిగుతుందని పాక్ కనీసం ఊహించలేకపోయింది. సెప్టెంబర్‌ 18న ఉరీలోని ఆర్మీ బేస్‌క్యాంపులోకి నలుగురు ఉగ్రవాదులు జొరబడి 19 మంది సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా, కేవలం 10 రోజుల వ్యవధిలోనే  పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై  భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. 

4) మోడీ మార్కు ముందుచూపుకు మరో నిదర్శనమే రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడం. రాంనాథ్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తారని ఎవరూ ఊహించలేదు. మరోవైవు వ్యూహాత్మకంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసి మిగతా పార్టీలను ఇరుకునపెట్టడమే కాక అందరికీ ఫోన్లు చేసి ఓట్లు సైతం వేయించుకోగలిగిన మిత్రద్వయంగా మోడీ-షా నిపుణుల మన్ననలు అందుకున్నారు. 


5) ఈ ఏడాది ఫిబ్రవరి 1న అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు కల్పించింది మోదీ సర్కార్. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరిలో అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు సభామోదం పొందింది. మూడోకంటికి తెలియకుండా టేబుల్‌ అజెండా కింద కేబినెట్‌ ముందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. 

6) ఫిబ్రవరి 14న బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై గురి పెట్టింది మన వాయుసేన. జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మందికిపైగా  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన తర్వాత భారత్‌ ప్రభుత్వం ఏం చేస్తుందా? అని దేశమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపారు. 


7) పార్లమెంటు ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరుగనున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశం అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించిందని ప్రకటించారు. ఆయన ప్రకటన అర్థంకాలేదు కానీ...మళ్లీ ఏదో అనూహ్య ఘటన జరిగిందని మాత్రం అందరూ గుర్తించారు. మార్చి 27వ తేదీన.. భారత్ ఓ పెద్ద అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిషన్ శక్తి పేరుతో అంతరిక్షంలో లో-ఎర్త్ ఆర్బిట్‌లోని ఒక లైవ్ శాటిలైట్‌ను ముందుగానే నిర్దేశించుకున్నట్టు 3 నిమిషాల్లోనే కూల్చేశామని స్వయంగా మోడీ ప్రకటించడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది. దీనిద్వారా అంతరిక్షంగానూ భారత్ సురక్షితంగా ఉందని, ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా సత్తా చాటినట్టయిందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి.  

8) చారిత్రక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనూ నెగ్గడంతో బీజేపీ సర్కార్ మరో ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది.  ప్రధానమంత్రి మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేకూరుతుంది. ముస్లిం మహిళలు  ఎదుర్కొంటున్న వివక్ష నుంచి విముక్తి కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాక్ బిల్లును తీసుకొచ్చింది. 

9) జమ్ము కశ్మీర్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది మోదీ సర్కార్.  జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుందర కశ్మీరానికి సరికొత్త సొబగులు అద్దారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కొనసాగింపుగా జరుగుతున్న నాటకీయ సంఘటనలతో విభజన బిల్లుతో తెరపడింది. దశాబ్దాలుగా జరుగుతున్న కశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో అమిత్ షాకు తప్ప మిగతా ఎంపీలకు కూడా తెలియక పోవడం విశేషం. 

10) ప్రపంచవ్యాప్తంగా చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే సామర్థ్యం గల అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ... సీఐఏ కూడా మోడీ నిర్వహించిన ఏ ఒక్క ఆపరేషన్ నూ పట్టుకోలేకపోయింది. అటు ఏ వార్తనైనా, ఎంతటి లోగుట్టునైనా బయటపెట్టే భారత మీడియా హౌజెస్ సైతం మోడీ ఆపరేషన్స్ ని పసిగట్టలేకపోయాయి. మోడీనే స్వయంగా డిక్లేర్ చేసేదాకా ప్రపంచానికి తెలియకపోవడం మోడీ మార్కు నిర్వహణా చతురతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 



మొత్తానికి అనుకున్నది సాధించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తిగా నరేంద్రమోడీ, అమిత్ షా ద్వయం దేశ ప్రజలందరి చేత ప్రశంసలు అందుకుంటుండడం విశేషం. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...