Skip to main content

రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ కథ తెలుసుకోవాలనుందా?

తొంభయ్యవ దశకంలో వచ్చిన ద్రోహి సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రక్షక దళాలకు పెనుసవాలుగా మారడమే గాక దేశ ఆంతరంగిక భద్రతకూ ప్రమాదకరంగా మారిన  తీవ్రవాదుల్ని తుదముట్టించే ఇతివృత్తంతో 1990ల్లో వచ్చిన ద్రోహి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల ఆనుపానులు, రక్షణపరమైన రహస్యాలు, భారీ దాడుల కోసం చేసే వ్యూహాలు తెలుసుకొనేందుకు.. పోలీసు అధికారులే రహస్యంగా నక్సలైట్ గ్రూపులోకి సిబ్బందిని పంపించి.. వారిని మట్టుపెట్టడం అందులోని ట్విస్ట్. అచ్చంగా అలాంటి అండర్ కవర్ ఆపరేషన్నే రియల్ లైఫ్ లో ఇప్పటికీ నిర్వహిస్తున్న ఇండియన్ జేమ్స్ బాండ్ గా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 



మోడీ ప్రధాని అయిన నాటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ పరమైన నిర్ణయాల్లో దోవల్ పాత్రే కీలకం. సర్జికల్ స్ట్రైక్స్‌ నుంచి డోక్లాం సమస్యలో చర్చలు, నిన్న మొన్నటి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భద్రత వరకు ఆయనే అన్నీ తానై నడిపారు. అంతేకాదు కశ్మీర్‌లో పౌరులకు ఎలాంటి ఢోకా లేదని చెప్పేందుకు సాధారణ పౌరుడిగా కశ్మీర్ వీధుల్లో తిరుగుతున్నారు.

అజిత్ దోవల్‌ తీరు ముందు నుంచి భిన్నమే. ఆయన కుటుంబ నేపథ్యం కూడా భారత ఆర్మీకి సంబంధించిందే. దోవల్ తండ్రి ఆర్మీ మేజర్‌గా పని చేశారు. దీంతో చిన్ననాటి నుంచే దోవల్‌కు దేశ భద్రతా వ్యవహారాలపై ఆసక్తి ఎక్కువ. 1968లో కేరళ కేడర్‌ నుంచి ఐపీఎస్ సర్వీసుల్లో చేరారు. నాటి నుంచి పలు కీలక ఆపరేషన్లకు సూత్రధారిగా వ్యవహరించారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్‌ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన బృందంలో దోవల్‌ కూడా సభ్యుడు. ఇలా కీలక సందర్భాల్లో దోవల్ సమయస్పూర్తితో వ్యవహరించారు. అందుకే రిటైర్మెంట్ సమయానికే దోవల్‌ కెరీర్‌ పరంగా పలు విజయాలు నమోదు చేసుకున్నారు.

చూసేందుకు సాధారణ పౌరుడిలా కనిపించే దోవల్‌ వెనుక భాషా సినిమాలో రజనీకాంత్ కు ఉన్నంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. పాకిస్థాన్‌లో గూఢచర్యం కోసం ఆయన ఏడేళ్ల పాటు ముస్లిం పౌరుడిలా గడిపారు. అచ్చంగా చెప్పాలంటే కమల్ హాసన్ మూవీ ద్రోహీలో చేసినట్లుగా...పాకిస్థాన్‌లో ఉంటూ అక్కడి సమాచారాన్ని ఇండియాకు చేరవేశారు. ఒకానొక సమయంలో ఓ వ్యక్తి ఆయన్ను హిందువుగా గుర్తుపట్టారు. కానీ అతను కూడా హిందువు కావడంతో దోవల్‌కు ముప్పు తప్పింది. పాక్‌ సైన్యంతో ఒక సామాన్య పౌరుడిలా కలిసిపోయారు దోవల్. అదే సమయంలో పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అనుబంధంపై సమాచారం సేకరించారు.  చుట్టూ కరుడుగట్టిన ఉగ్రవాదులు, భారత వ్యతిరేకుల మధ్య సాహసోపేతంగా, అంతకంటే ఎక్కువ చాణక్యత ప్రదర్శిస్తూ...పాక్ ఆటకట్టే ప్లాన్లు వేశారు. గూఢచారిగా ఏడేళ్లు తిరగడమే కాదు, పాక్‌ రాయబార కార్యాలయంనూ అధికారిగా పని చేశారు దోవల్. అందుకే పాక్ ఎత్తులపై దోవల్‌కు పూర్తి అవగాహన ఉంది.

కేవలం పాకిస్థాన్‌లో అండర్ కవర్ ఆపరేషన్ మాత్రమే కాదు, దోవల్ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇండియాలో కూడా ఆయన సామాన్య వ్యక్తిలా జనంలోకి వెళ్తారు. సిక్కుల స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ను విజయవంతం చేయడంలో దోవల్ వేసిన స్కెచ్ సామాన్యమైనది కాదు. కరుడుగట్టిన ఉగ్రవాదులు చుట్టుముట్టిన స్వర్ణ దేవాలయంలోకి ఒక రిక్షావాలాగా ప్రవేశించారు. అక్కడి కీలక సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేశారు. అంతేకాదు 2014లో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇరాక్‌లో ఉగ్రవాదులు అపహరించుకుపోయిన 46 మంది భారత నర్సులను సురక్షితంగా విడిపించారు.

శత్రుదేశాల్లో గూఢచర్యం చేయడం వల్ల వారికి ఆయన ఆయా దేశాలకు ద్రోహిలా కనిపించవచ్చు, కానీ భారత్‌కు మాత్రం అజిత్ దోవల్ ఒక హీరో. అందుకే సైనికులకు మాత్రమే దక్కే కీర్తి చక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్ అధికారిగా దోవల్ నిలిచారు. దోవల్‌ సర్వీసు మొత్తం సాహసాలతోనే గడుస్తోంది. తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా జమ్మూకశ్మీర్ స్థానికులతో కలిసి ఆయన వీధుల్లో కలియ తిరిగారు. అక్కడ గ్రౌండ్ రిపోర్టును ఉన్నది ఉన్నట్లుగా కేంద్రానికి తెలియజేసేందుకు సాధారణ పౌరుడిలా మారారు. 


- టి.రమేశ్ బాబు


- 9032003022


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.