Skip to main content

ఆంధ్రాలో కాపులకు బీజేపీ ఎందుకు గాలం వేస్తోంది?


ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవిని కాపులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంతటి సమర్ధులు లేరా? ఆర్థికంగా స్థితిమంతులు కారా? వంగవీటి రంగా, దాసరి నారాయణ రావు, కన్నా లక్ష్మీ నారాయణ, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం సీఎం అయ్యే అర్హతలు ఉన్నా ఆ పదవిని ఎందుకు అందుకోలేకపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఇపుడు సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో కాపులకు ఉన్న అడ్వాంటేజెస్ డిజాడ్వంటేజెస్ ఏమున్నాయో ఓసారి చూద్దాం. 



తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవి కాపులకు అందని ద్రాక్షలానే మిగిలింది. కాపు సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా....సీఎం పదవిని మాత్రం అందుకోలేకపోవడంతో  వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,  బీజేపీలలో కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అయితే బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో తన ముద్ర వేయలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులతో అరకొర సీట్లు సాధిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే అధికారం దక్కించుకోగలిగింది. 2014 నుంచి ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బీజేపీ దక్షిణాదిలో పాగావేయలేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా కనిపిస్తోంది. 



దక్షిణాది రాష్ట్రాలలో పలు పేర్లతో పిలుస్తున్న కాపు సామాజికవర్గం జనాభా దాదాపు 26 శాతం ఉన్నట్లు గా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ లానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత రెడ్డి సామాజిక వర్గ ప్రాధాన్యం తెలంగాణ కాంగ్రెస్ కి పరిమిత మయింది. ఏపీలో రెడ్లందరూ వైసీపీకి జై కొట్టారు. దీంతో రెడ్లకు వైసీపీ, కమ్మ సామాజిక వర్గానికి టీడీపీలు ఉండగా ఉన్నాయి.  ఈ రెండు వర్గాలకు మీడియా అండదండలు పుష్కలంగా ఉన్నాయి.  అయితే కాపులకు ప్రాతినిథ్యం వహించేందుకు  పూర్తి స్థాయిలో పార్టీ లేకపోవడం ...అంతకు మించి మీడియా సపోర్ట్ కూడా లేకపోవడం వెలితిగా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగానే అంటున్నారు. పార్టీ ఏదైనా కాపు నేతలు ప్రతి ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు దక్కించుకుంటున్నారు. అయితే సీఎం పీఠం దక్కించుకునేందుకు కాపు నేతలు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదనే చెప్పాలి. 



కాపులకు ఐక్యత లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఉన్నత పదవులు పొందలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా స్థితిమంతులైన నేతలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాపు సామాజిక వర్గంలో ఉన్న సినీనటులు తమకున్న ప్రజాదరణను ఓటు బ్యాంకు గా మలచుకోవడంలో విఫలమయ్యారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో తమకు దక్కిన మంత్రి పదవులతో సంత్రుప్తి చెందడం కూడా సీఎం పీఠం దాకా చేరుకోకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. 



ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా కాపులకు యూనిటీ రావడం ప్రస్తుతం కొంత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో సీఎం పీఠాన్ని కన్నా లక్ష్మీ నారాయణ త్రుటిలో చేజార్చుకున్నారు. ఇపుడు కన్నా బీజేపీ అధ్యక్షుడిగా  ఉండటం, సోము వీర్రాజు లాంటి నేతలు అయనకు బీజేపీ దన్నుగా నిలవడంతో కాపులకు సీఎం పీఠం దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు సీఎం పీఠం దాకా వచ్చినా సినీరంగంలో తనదైన ముద్ర వేసిన దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నా సీఎం అయ్యేందుకు పరిస్థితులు అంతగా అనుకూలించలేదనే చెప్పాలి. ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించిన సినీ నటుడు చిరంజీవి కూడా తనకున్న ప్రజాదరణను ఓట్లగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ...కాపు సామాజిక వర్గానికి పెద్దాయనలా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభం..ఇటీవలి ఎన్నికల తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  



బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి అన్ని రాష్ట్రాలలోని కాపు సామాజిక వర్గాన్ని చేరదీస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ బలపడేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ రెండు లక్షల బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించడం మీటింగ్ పెట్టడం దీనికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ల నుంచి వందల సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 



ఈ సమీకరణాల్ని ద్రుష్టిలో పెట్టుకుని ఏపీలో బీజేపీ భారీ స్కెచ్ కి వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. చిరంజీవికి అత్యంత ఆప్తుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. గంటాతోపాటు అన్ని పార్టీలలోని కాపు నేతలను కూడా బీజేపీలోకి తెచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైరా సినిమా ప్రమోషన్ అంటూ చిరంజీవి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారని సమాచారం. అన్నయ్య సీఎం అయ్యేందుకు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన అండదండలు ఖచ్చితంగా ఉంటాయని బీజేపీ విశ్వసిస్తోంది. మరోవైపు అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీలతో  పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాపు వర్గానికి చెందిన వారు సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
 

దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలకు గాలం వేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ప్రబల శక్తిగా అవతరించాలని బీజేపీ భావిస్తోంది. మరి బీజేపీలో తిరుగులేని వ్యూహకర్తలుగా పేరొందిన మోడీ అమిత్ షాల ద్వయం అనుసరిస్తున్న వ్యూహం ఏపీలో బీజేపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...