భూమా అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో తండ్రి విక్రయించిన స్థలంపై వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా ఆస్తికోసం అక్కపై కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా హిడెన్ అజెండా ఉందా....... అక్కపై తమ్ముడు నిజంగా కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా?
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై కర్నూలు జిల్లావాసులు భూమా అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు. తన ఇద్దరు అక్కలపై భూమా కుమారుడు ఎందుకు కోర్టుకు ఎక్కారు..... ఎప్పుడో అమ్మిన భూమిపై వాటా కోసం ఇప్పడు పట్టుబట్టడం ఏంటని బుర్రలు పీకుంటున్నారు. తల్లిదండ్రుల మరణంతో భూమా కుటుంబానికి అఖిలప్రయ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు...అటు తమ కుటుంబానికి అండగా నిలిచిన అభిమాన బలాన్ని కాపాడుకుంటూ .. ఇటు రాజకీయ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటుూ ముందుకు సాగుతున్నారు.
కొద్దిరోజుల క్రితం భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కేసులు వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో కూడా భార్గవ్‌పై ఓ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా సొంత తమ్ముడు కోర్టుకు ఎక్కాడన్న వార్తలు కర్నూలు , నంద్యాలలో హాట్‌టాపిక్ గా మారాయి. మరోపక్క తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. తాను దుబాయ్‌లో ఉన్నానంటూ తమ కుటుంబం అంతా కలిసే ఉందని.. తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దీంతో భూమా కుటుంబంలో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. కేవలం భూమి కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేందుకే న్యాయవాదుల సలహా మేరకే విఖ్యాత్ కోర్టును ఆశ్రయించారని ఈ కేసును వాదిస్తున్న లాయర్ కూడా భూమా అఖిలప్రియ బంధువే అని సమాచారం. అఖిలప్రియ స్పందించి నిజం ఏంటో వెల్లడించాలని అభిమానులు కోరుతున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: