భారత్ ప్రాచీన దేశం. పేరుకు తగినట్టే పురాతన విగ్రహాలకు, ప్రాచీన సంస్కృతికి, వెల కట్టలేని సాంస్కృతిక వైభవానికి మన దేశం పెట్టింది పేరు. పైన ఫొటోలో చూస్తున్న విగ్రహం విష్ణుమూర్తిది. అనంత పద్మనాభస్వామి అనగానే కేరళలో ఉన్నాడనే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ అలాంటి అనంత శయనుడి విగ్రహాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దాదాపు అలాంటి భంగిమలోనే మధ్యప్రదేశ్ లోని బాంధవగఢ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. విగ్రహానికి అంతా నాచుపట్టి, నిరాదరణకు గురైన స్థితిలో ఉంది. కానీ విగ్రహం ఒరిజినాలిటీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇది వెయ్యేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. పార్కుకు వచ్చే సందర్శకులు ఈ విగ్రహాన్ని చూసి, ఆ పుణ్యస్థలానికి పునర్వైభవం తేవాలని కోరుతున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: