దేశంలో అగ్రగామి వాణిజ్యవేత్తగా, ప్రపంచంలోని వంద ప్రభావశీలుర జాబితాలో ఒకడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపారంలో వైరి వర్గాలను ఊచకోత కోస్తున్నారు. ముఖేశ్ మొదలుపెట్టిన ఊచకోత మరింత తీవ్రరూపం దాలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఓ నూతన శకాన్ని కూడా ఆరంభించడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
టెలికాం రంగంలో ఓ మోస్తరు కంపెనీలను సైతం జియో బిస్తరు సర్దుకునేలా చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ డాటా ఆఫర్ తో ఇండియా ప్రజానీకాన్ని అంతర్జాల ప్రియులుగా మార్చేసిన జియో… అది ఇస్తున్న పోటీకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలను బేజారెత్తిస్తోంది. బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రెండు కంపెనీలు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ రంగంలో జియో అప్రతిహతంగా దూసుకెళ్లడానికి ఆటంకాలేవీ లేవనే చెప్పాలి.
టెలికాం రంగంలో బీభత్సం సృష్టిస్తున్న రిలయన్స్.. ఈ-కామర్స్ లోనూ అడుగు పెట్టేందుకు కొన్నేళ్ల క్రితమే పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఆ విషయం మార్కెట్ కు ఇంకా బయటకు పొక్కకముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి టాప్ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టి మధ్యతరగతి వినియోగదారులకు చేరవయ్యాయి. ఆన్ లైన్ మార్కెట్ ను శాసిస్తూ తమ వాటాను పటిష్టం చేసుకున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వ్యూహాలు తనకే విధంగానూ పోటీ కాదని అంబానీ ధీమాగా ఉన్నారో ఏమో కానీ.. విస్తృతంగా వ్యాపించి ఆ కంపెనీల వాటా గురింంచి పెద్దగా బాధపడలేదు. తనదగ్గరున్న సీక్రెట్ అలాంటిదేమో మరి.
గతేడాది చివరినాటికే అంబానీ అమ్ములపొదిలో ఉన్న మార్కెట్ సీక్రెట్ కాస్తా బట్టబయలైంది. ఈ-కామర్స్, ఆన్ లైన్ మార్కెట్ లోకి టిఫనీ అనే సంస్థతో కలిసి అడుగు పెట్టింది రిలయన్స్. ఇప్పటికే ముంబై శివార్లలో మాల్స్ నెలకొల్పవడం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు దీటుగా.. మరిన్ని కొత్త ఐడియాలతో భారత గృహాల్లోకి దూసుకెళ్తోంది. యాప్ బేస్డ్ బిజినెస్ ద్వారా డోర్ డెలివరీ చేస్తుండడం రిటైల్ మార్కెట్లో అంబానీ కొత్తసూత్రంగా తెలుస్తోంది. గృహస్తులకు అవసరమైన అన్ని వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డరిస్తే.. జస్ట్ టిఫిన్, లంచ్ ఇంటికి వచ్చినట్టుగా.. కావాల్సిన వస్తువులన్నీ ఇంటికే వచ్చేస్తాయన్నమాట. ముంబైలో ప్రయోగాత్మకంగా మొదలైన జియో మార్ట్ ఆపరేషన్.. అతి త్వరలోనే హైదరాబాద్ కు వస్తోంది. ఇప్పటికే ముఖేశ్ ప్రతినిధుల బృందం పలుచోట్ల స్థలాల కోసం సర్వే కూడా జరిపినట్లు సమాచారం.
పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ ల ఆవిర్భావం సగటు కిరాణాదారుడి వ్యాపారం గణనీయంగా దెబ్బతింది. ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్ అండ్ డోర్ డెలివరీతో వీధి చివర్న ఉండే సామాన్య వ్యాపారవేత్తల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
Comments
Post a Comment
Your Comments Please: