Skip to main content

Posts

Showing posts from March, 2020

కకావికలమవుతున్న వలస కూలీ బతుకులు

కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిల్లాడిపోతున్నారు. బుక్కెడు బువ్వ కోసం, పూట గడవకపోయినా కనీసం పిల్లలకైనా కాస్తోకూస్తో మంచి చదువులు దొరుకుతాయన్న ఉద్దేశంతో వందల కిలోమీటర్లయినా భారం అనకుండా పట్నం వెళ్లిన కూలీలు వీరు. ఇప్పుడు ఇల్లు చేరుకునేందుకు చుక్కలు చూడాల్సి వస్తోంది. దేశమంతా ఇదే పరిస్థితి. మొన్న ఢిల్లీ నుంచి పక్క రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు గుమిగూడిన జనంతో ఆనందవిహార్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎంత జనం వస్తారో.. అలా కనిపించింది ఆ జనాన్ని చూస్తే. దేశం లాక్ డౌన్ అయిన వారం తరువాత కూడా ప్రభుత్వాలు కూలీ జనం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ దృశ్యం ద్వారా తెలుసుకోవచ్చు.  ఇక దేశ రాజధాని నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న కేరళ, తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషాయనికే వస్తే ఎటూ 100, 200 కిలోమీటర్లకు పైబడ్డ దూరం నుంచే గాక... ఒడిశా, బీహార్, యూపీ, కోల్ కతా, కర్నాటక వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో కూలీలు బతుకుదెరువు కోసం వచ్చారు. వారంతా ఇక్కడే స్లమ్ ఏరియాల్లో, సిటీ ఔట్ స్క...

చంటిబిడ్డల శవాలతో తల్లులు.. చేతులెత్తేసిన ఇటలీ

ఇటలీ దేశం శవాల దిబ్బగా మారుతోంది. అందుకు తార్కాణమే తాజా ఫొటోలు. 

కరోనా వైరస్ శరీరంలో చేరితే ఏమవుతుంది?

  కరోనా వైరస్ వ్యాప్తి వెనుక భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ఇంత పెద్ద నష్టం కలిగిస్తుందా అనిపిస్తుంది. కానీ అది నిజం.  కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బు వున్నట్టు తెలీదు. మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంటుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి కొద్ది ఇన్‌ఫెక్షన్‌గా ఉంటుంది. ప్రధాన లక్షణా...

కరోనా ఫ్యామిలీ చాలా పెద్దది.. ఒక్కొక్కటీ మహా హంతకి

       (కరోనా ధాటికి వల్లకాడవుతున్న ఇటలీ) చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కరోనా వైరస్‌. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో ఈ కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్. కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా అనే పదం.. క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్ లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెండురకాల కరోనావైర...

తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే

కరోనా వైరస్ అంటుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల క్రమంగా కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి.మరణ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తానికి అనుభవంలోకి వస్తున్న భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ మృత్యు కోరలు చాస్తున్నా.. దానికన్నా కూడా నరనరాల్లో భయంకరంగా వ్యాపించి ఉన్న అతివిశ్వాసపు ఏహ్య భావాల జాడ్యం మాత్రం కొందరిలో ఇప్పటికీ బుసలు కొడుతుండడమే విచిత్రం.  ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి ప్రపంచ ప్రజల్లో, ప్రపంచ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కోసం జనాన్ని సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనకు విపరీతమైన ఆదరణ లభించడం చూస్తుంటే భారత ప్రజలు ఎంత స్వేచ్ఛను కోరుకుంటారో.. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు అంతా సహకరించి ఒక్క తాటిపైకి వస్తారని కూడా రుజువవుతోంది.  చద్దిమూటలవుతున్న పెద్దల మాటలు పెద్దల మాట చద్దిమూట అన్న సూక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని కొట్టిపారేశాం. మనలో చాలామంది నిన్నటివరకు నవ్వుకున్నారు కూడా. కానీ ఇప్పుడదే సూక్తి...

మోడీ సోషల్ మీడియా వదిలేస్తే ఏమౌతుంది?

  ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలుకుతారన్న ప్రకటన సోషల్ మీడియాలో కలకలమే రేపుతోంది. ఎందుకంటే కోట్లాది  మంది ఫాలోయర్లు మోడీకి ఉన్నారు. ఈ విషయంలో మన దేశంలో మోడీనే టాప్ లో ఉండడం గమనించాల్సిన అంశం. అంతమంది ఫాలోయర్స్ ను పెట్టుకొని అకౌంట్స్ ని వదిలేసేందుకు సిద్ధమవడం చాలా గొప్ప విషయమే కాక ఆలోచించాల్సిన విషయం కూడా.  మోడీ సోషల్ మీడియాను వదులుకోవడానికి కారణాలు ఇవీ -  1) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలావరకు న్యూస్ ని స్ప్రెడ్ చేయడమే తప్ప.. వాటి మీద కంట్రోల్ లేకపోవడం. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్.  2) కంట్రోల్ చేయాలనుకున్నా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం. ముఖ్యంగా అందుకోసం చిత్తశుద్ధి లేకపోవడం.  3) వన్ బిలియన్ ప్రజల మార్కును దాటిన భారత్ లో దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు నిత్యం ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. దీంతో నెట్ వర్క్ బిజినెస్ లో ఇండియాది పైచేయిగా మారుతోంది. దీన్ని బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్న సోషల్ మీడియా బాసులు రూమర్స్ అంశాన్ని అసలేమాత్రం పట్టిించుకోవడం లేదు. పైగా ఆ రూమర్స్ నే బిజినెస్ పాయింట్ గా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీత...

గత్తర లేపుతున్న కరొనా... గడప ముందుకొచ్చింది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా వైరస్ ఇండియాకు రానే వచ్చింది. మొన్ననే కేరళలో ముగ్గురు యువకులకు సోకినట్లు కన్ఫామ్ అయినప్పటికీ ట్రీట్ మెంట్ తరువాత వారిని డిశ్చార్చ్ చేశారు. వారిని యథేచ్ఛగా బయట తిరగరాదని హెచ్చరించి వదిలారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు యథేచ్ఛగా వెళ్లరాదని స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది విమానయానాలు రద్దు చేసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప.. కరొనా వైరస్ భయానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలం అవుతోంది. అయితే తాజాగా మరో ఇద్దరికి కరొనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మొన్నటిదాకా కరొనా వైరస్ ను లైట్ తీసుకున్న ప్రజలు.... ఇప్పుడు చాలా భయపడుతున్నారు. తరచుగా ఇటలీ వెళ్లే ఒక ఢిల్లీవాసి, తరచుగా దుబాయికి వెళ్లే తెలంగాణ వాసి... ఈ కరొనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరు ఇండియాలో ఐదుగురికి కరొనా వైరస్ సోకినట్టు అధికారికంగా గుర్తించినట్టయింది. మరి ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతుందా.. అలా జరక్కపోతే ఇండియా పరిస్థితి ఏంటి... చైనాలో మాదిరిగా కొన్ని గంటల్లోనే మనకు ఓ స్టేడియాన్ని హాస్పిటల్ గా మార్చే సామర్థ్యం గానీ, వె...