ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా వైరస్ ఇండియాకు రానే వచ్చింది. మొన్ననే కేరళలో ముగ్గురు యువకులకు సోకినట్లు కన్ఫామ్ అయినప్పటికీ ట్రీట్ మెంట్ తరువాత వారిని డిశ్చార్చ్ చేశారు. వారిని యథేచ్ఛగా బయట తిరగరాదని హెచ్చరించి వదిలారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు యథేచ్ఛగా వెళ్లరాదని స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది విమానయానాలు రద్దు చేసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప.. కరొనా వైరస్ భయానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలం అవుతోంది. అయితే తాజాగా మరో ఇద్దరికి కరొనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మొన్నటిదాకా కరొనా వైరస్ ను లైట్ తీసుకున్న ప్రజలు.... ఇప్పుడు చాలా భయపడుతున్నారు. తరచుగా ఇటలీ వెళ్లే ఒక ఢిల్లీవాసి, తరచుగా దుబాయికి వెళ్లే తెలంగాణ వాసి... ఈ కరొనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరు ఇండియాలో ఐదుగురికి కరొనా వైరస్ సోకినట్టు అధికారికంగా గుర్తించినట్టయింది. మరి ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతుందా.. అలా జరక్కపోతే ఇండియా పరిస్థితి ఏంటి... చైనాలో మాదిరిగా కొన్ని గంటల్లోనే మనకు ఓ స్టేడియాన్ని హాస్పిటల్ గా మార్చే సామర్థ్యం గానీ, వెసులుబాట్లు గానీ ఉన్నాయా... ఈ విషయంలో మనం చాలా పూర్. మన ఇండియన్ల మనస్తత్వాలు, నిర్లక్ష్యపూరిత వ్యవహారం వంటి అంశాలను బట్టి చూస్తే వైరస్ సోకకుండా నిరోధించుకోవడం తప్ప.. వైరస్ వ్యాపించకుండా అరికట్టడం అంత సులువు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చైనా కన్నా మనం ఎంతో నయం
మంచికైనా, చెడుకైనా మన పక్కనున్న చైనాతో పోల్చుకోవడం చాలా కామన్. అదే ప్రకారంగా చూసుకుంటే చైనా కన్నా మన ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక పునాదులు చాలా విభిన్నమైనవి. ఆ లెక్కన చూసుకుంటే మన ఇండియాలో కరొనా వైరస్ వ్యాప్తి చెందడం అంత సులువు కాదన్న పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వైరస్ సొకినవారు వారికి తెలిసో తెలియకో, కన్ఫామ్ కాకముందో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తే గనక అది ఉపద్రవంగా మారే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. కానీ.. సాధారణ పరిస్థితుల్లో అయితే మాత్రం వైరస్ సోకినివారిని ఎవరితో కలవనీయకుండా చేస్తే కరొనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందడం అసాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Photo: Financial Express
Comments
Post a Comment
Your Comments Please: