ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలుకుతారన్న ప్రకటన సోషల్ మీడియాలో కలకలమే రేపుతోంది. ఎందుకంటే కోట్లాది మంది ఫాలోయర్లు మోడీకి ఉన్నారు. ఈ విషయంలో మన దేశంలో మోడీనే టాప్ లో ఉండడం గమనించాల్సిన అంశం. అంతమంది ఫాలోయర్స్ ను పెట్టుకొని అకౌంట్స్ ని వదిలేసేందుకు సిద్ధమవడం చాలా గొప్ప విషయమే కాక ఆలోచించాల్సిన విషయం కూడా.
మోడీ సోషల్ మీడియాను వదులుకోవడానికి కారణాలు ఇవీ -
1) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలావరకు న్యూస్ ని స్ప్రెడ్ చేయడమే తప్ప.. వాటి మీద కంట్రోల్ లేకపోవడం. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్.
2) కంట్రోల్ చేయాలనుకున్నా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం. ముఖ్యంగా అందుకోసం చిత్తశుద్ధి లేకపోవడం.
3) వన్ బిలియన్ ప్రజల మార్కును దాటిన భారత్ లో దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు నిత్యం ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. దీంతో నెట్ వర్క్ బిజినెస్ లో ఇండియాది పైచేయిగా మారుతోంది. దీన్ని బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్న సోషల్ మీడియా బాసులు రూమర్స్ అంశాన్ని అసలేమాత్రం పట్టిించుకోవడం లేదు. పైగా ఆ రూమర్స్ నే బిజినెస్ పాయింట్ గా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి.
4) భారత్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల విషయంలో సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించడం లేదు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు జమ్మూ-కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం చేసిన ప్రయత్నాలను కాకుండా చిన్నచిన్న ప్రదర్శనలకు అధిక ప్రయారిటీ ఇచ్చి అభూత కల్పనలు ప్రచారం చేసింది. అలాంటి అభూతకల్పనలన్నీ ఫేక్ అకౌంట్ల ద్వారానే జరిగిన విషయం రుజువైంది. కానీ ట్విట్టర్ యాజమాన్యం మాత్రం దేశ ప్రజల సెంటిమెంట్స్ ను పట్టించుకోలేదు. ఫేక్ అకౌంట్లను కట్టడి చేయలేదు. అలాగే అక్కడున్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నం కూడా చేయలేదు.
5) అమెరికా అధ్యక్షుడి ఎన్నికల సందర్భంలో ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్ల సమాచారాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారన్న ఆరోపణలు జుకర్ బర్గ్ మీద ఉండనే ఉన్నాయి. ఇది గమనించాల్సిన అంశం.
మోడీ లాంటి వారు వదిలేస్తే మంచిదే -
ప్రపంచంలో అత్యధిక ఫాలోయర్లు ఉన్న నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్లు వదిలేస్తే అది ఓ మంచి సంప్రదాయమే అవుతుంది. కనీసం ఇప్పుడైనా ఆయా యాజమాన్యాలు పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా అనేది వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక. అందులో ఎవరికి తోచింది వారు రాసుకుంటారు. నచ్చినవాళ్లు యాడ్ అవుతారు. నచ్చనివారు లెఫ్ట్ అయిపోతారు. ఎవరికీ లాభ-నష్టాలతో పనిలేదు. బాధ్యతల పట్టింపు అసలే ఉండదు. నా అకౌంట్ - నా ఇష్టం అన్నట్టుగా రాతలు, కూతలు సాగిపోతుంటాయి. ఒకర్ని నియంత్రించే అధికారం ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు ఇదో పెద్ద సవాలై కూర్చుంది.
ప్రత్యామ్నాయం ఏంటి?
అయితే మోడీ తన అకౌంట్లను వదిలేస్తాను అంటూనే ప్రజలతో టచ్ లో ఉంటాను అనడం మాత్రం ఆసక్తి రేపుతోంది. ఏ విధంగా టచ్ లో ఉంటారు.. రేడియో, దూరదర్శన్ లాంటివాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటారా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వంటివాటిని సోషల్ మీడియాలోకి తీసుకొస్తారా.. లేక మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికే ఆలోచించి పెట్టారా.. అన్నది చాలా ఆసక్తిగా మారింది. బాధ్యత లేని సోషల్ మీడియాను నిషేధించి, బాధ్యతగా ప్రవర్తించే జనరల్ మీడియాను అమితంగా ప్రోత్సహిస్తారా? అదే జరిగితే జనరల్ మీడియాకు మంచిరోజులు వచ్చినట్టే. జనరల్ మీడియాలోకి ఇప్పటికే ఎఫ్.డి.ఐ. లకు పూర్తి పర్మిషన్ ఇచ్చిన మోడీ మనసులో ఇంకెలాంటి ఆలోచనలున్నాయో వేచి చూడాలి. అయితే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారి సేవలను, త్యాగాలను హైలైట్ చేస్తూ తన అకౌంట్లను వారు గానీ, వారి తరఫున కథనాలు గానీ పోస్ట్ చేసేవారు టేకోవర్ చేసుకునే అవకాశం కల్పించడం మాత్రం వినూత్నమైన ఆలోచన.
Photo: pragativadi
Comments
Post a Comment
Your Comments Please: