కరోనా వైరస్ అంటుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల క్రమంగా కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి.మరణ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తానికి అనుభవంలోకి వస్తున్న భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ మృత్యు కోరలు చాస్తున్నా.. దానికన్నా కూడా నరనరాల్లో భయంకరంగా వ్యాపించి ఉన్న అతివిశ్వాసపు ఏహ్య భావాల జాడ్యం మాత్రం కొందరిలో ఇప్పటికీ బుసలు కొడుతుండడమే విచిత్రం.
ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి ప్రపంచ ప్రజల్లో, ప్రపంచ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కోసం జనాన్ని సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనకు విపరీతమైన ఆదరణ లభించడం చూస్తుంటే భారత ప్రజలు ఎంత స్వేచ్ఛను కోరుకుంటారో.. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు అంతా సహకరించి ఒక్క తాటిపైకి వస్తారని కూడా రుజువవుతోంది.
చద్దిమూటలవుతున్న పెద్దల మాటలు
పెద్దల మాట చద్దిమూట అన్న సూక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని కొట్టిపారేశాం. మనలో చాలామంది నిన్నటివరకు నవ్వుకున్నారు కూడా. కానీ ఇప్పుడదే సూక్తి కరోనా మహమ్మారి నుంచి కాపాడే తారకమంత్రమే అయింది.
1) ఎంగిలి (అంగిలి) అంటుకోరాదు
ఒకరి ఎంగిలి ఇంకొకరికి అంటుకోరాదన్నది చిన్నప్పుడు అమ్మా-నాన్న, నాన్నమ్మ-తాత లాంటి పెద్దలు చాలా స్ట్రిక్టుగా చెప్పేవాళ్లు. కొన్నిసార్లు బయటివాళ్ల ఎంగిలి తిన్నామని తెలిస్తే బెత్తం దెబ్బలు కూడా పడ్డరోజులున్నాయి. అందులో ఏం తప్పుంది? తిన్నంతమాత్రం ఏం కొంపలు మునుగుతాయో ఎంత ఆలోచించినా అప్పట్లో అర్థమయ్యేది కాదు. అయితే వాళ్లకు విడమరిచి చెప్పే విజ్ఞానం లేకపోవచ్చు కానీ.. వాళ్లు అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మాత్రం తు.చ. తప్పకుండా పాటించేవారు. దానికి విఘాతం కలిగితే సహించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ అందులోని మర్మం ఏంటో అనుభవంలోకి వచ్చేసింది.
2) నైవేద్యం వండేటప్పుడు అంత చాదస్తమా?
ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు దేవుడికి ప్రసాదాలు తయారు చేయడం అందరికీ తెలిసిందే. ఆ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు వాళ్ల అత్తగారు ఒక్క మాట కూడా మాట్లాడనిచ్చేది కాదని మా అమ్మ చెప్పేది. అంత మూర్ఖత్వమా అని నా లాంటివాళ్లం అనుకునేవాళ్లం. ప్రసాదాల వంటి పవిత్రమైన వంటకాలు చేసేటప్పుడు నోటికి గుడ్డు కూడా కట్టుకునేవారని మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. ఆ మాటలు విని మొన్నటివరకు మేం నవ్వుకున్నాం. కానీ కరోనా విశ్వరూపం చూపిస్తున్నప్పుడు, ప్రపంచమంతా కూడా మూతులకు మాస్కులు తగిలించుకోవడం చూస్తున్నప్పుడు వారి చాదస్తం లోపల కూడా ఇంత పరమార్థం ఉందా అని అనిపించక మానదు.
3) లాలాజలాన్ని లైట్ తీసుకోరాదు
హెచ్ఐవీ రోగులను సమాజం నుంచి బాయ్ కాట్ చేయవద్దన్న ఉద్దేశంతో డాక్టర్లు, మీడియా అంతా కూడా.. హెచ్ఐవీ సోకిన వ్యక్తిని తాకితే ఏమీ కాదని, వారు తిన్న ప్లేట్ లో తిన్నా, వారిని అంటుుకున్నా, వారి ఎంగిలి మనం గ్రహించినా ఏమీ కాదని పనికట్టుకొని మరీ ప్రచారం చేశారు. లాలాజలంలో హైచ్ఐవీ వైరస్ ఉండదని శాస్త్రీయంగా రుజువు చేశారు. కానీ ఇప్పుడేమంటారు మన డాక్టర్లు?హెచ్ఐవీ గురించి ఒకరకంగా చెప్పిన డాక్టర్లు, కరోనా వైరస్ గురించి అదే సూత్రానికి వ్యతిరేకంగా మరో కొత్త సూత్రాన్ని తయారు చేసి చెప్తారా? అంటే రోగానికో సూత్రం తయారు చేసి ప్రజల్ని కన్ఫ్జూజ్ చేయడమేనా డాక్టర్ల పని? దీనివల్ల అర్థం చేసుకోవాల్సిందేంటంటే.. గొప్పగా అభివృద్ధి చెందిందని భావిస్తున్న మన సైన్సు భారతీయ సంప్రదాయాల కన్నా ఇంకా వెనుకబడే ఉందని. వైరస్ బయట పడిన తరువాత దాని లక్షణాలు తెలుసుకొని, దాని వ్యాప్తి ఎలా జరుగుతుందో అర్థం చేసుకొని మందులు కనుక్కునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మన పూర్వీకులు ఆ నష్టం కూడా జరగకుండా చాలా ముందు చూపుతో కామన్ సూత్రాలు కొన్ని తయారు చేశారు.
4) కామన్ సూత్రాలు కొన్ని
- ఒకరికొొకరు అంటుకోకుండా దూరంగా ఉండడం.
- ఒకరి గాలి ఒకరికి సోకకుండా వ్యవహరించడం- ఒకరు వాడిన నీళ్లు మరొకరు వాడకపోవడం- ఒకరు తిన్న కంచాన్ని మరొకరు వాడకపోవడం (ఆకుభోజనం అందుకే)
- ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం- ఇంట్లోకి వచ్చాక ఆ దుస్తుల్ని ఇంటి బయటే మూలన పడేసి, వాటిని నీటితో తడిపేయడం లేదా ఉతుక్కోవడం- అపరిచితుల్ని లేదా కొత్తవారిని (బంధువులైనా సరే) కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి రానివ్వకపోవడం
5) పైన చెప్పుకున్నవన్నీ చాదస్తంగానో, అంటరానితనంగానో చెప్పుకొని లైట్ తీసుకున్నాం. మడి ఆచారాల్ని అంటరానితనంగా చెప్పుకొని దానికి వ్యతిరేకంగా చట్టాలు కూడా తయారు చేసుకున్నాం. చాలా మంది (అమాయకులో, అజ్ఞానులో)ని శిక్షించుకున్నాం. అంటరానితనం పాటించినందుకు ఎందరికో జరిమానాలు విధించుకున్నాం. కానీ బాగా చదువుకున్నానని విర్రవీగుతున్న ఆధునిక మానవుడు.. పాత అలవాట్లను ఇప్పుడు తప్పంటాడా.. మనిషికి, మనిషికి మధ్య కనీసం మీటరు దూరం ఉండాలని లేకపోతే చట్టరీత్యా శిక్షార్హులవుతారని కొత్త చట్టాలు తయారు చేస్తాడా? కనీసం ఆత్మపరిశీలన అయినా చేసుకుంటాడా?
6) యజ్ఞయాగాలతో లాభాలు
- యజ్ఞయాగాలతో కంటికి కనపడని అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎంత మొత్తుకున్నా లైట్ తీసుకున్నాం.
- కరోనా విజృంభించాక ఇంట్లో కుంపటి విలువ తెలిసిపోయి ఇప్పుడు ప్రపంచమంతాా ఆ బాటన పయనిస్తోంది.
- మొన్నమొన్నటివరకు ప్రతి ఇంట్లో ఒక మూలన అగ్ని ఉండేది. ముఖ్యగా రాత్రి వేళల్లో నిరంతరంగా నిప్పు వెలిగేది.
- నిప్పు దేన్నయినా దహించివేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా.
ఆధునిక మానవుడు ఇప్పుడు అంతర్ముఖుడు కావాల్సిన సమయం వచ్చిందంటున్నారు అనుభవజ్ఞలు.
Comments
Post a Comment
Your Comments Please: