గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకలైనవారికి అన్నం రెడీగా ఉందంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కల్వకుంట్ల కవిత. ఇందుకోసం ఒక హెల్ప్ లైన్ తీసుకొచ్చామని, ఆ నెంబర్ ని అందరికీ తెలిసేలా పాపులరైజ్ చేయాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరారు. భోజనం అవసరం ఉన్నవారు 040-21111111 (040-2 ఏడు ఒకట్లు) నెంబర్ కి కాల్ చేస్తే భోజనం ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నదని, హైదరాబాద్ లాంటి పెద్దనగరంల ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించరాదని కవిత ఆకాంక్షించారు. ఆహారం నేరుగా అందుకునే అవకాశం లేనివారు ఈ నెంబర్ కు డయల్ చేయడం ద్వారా ఆకలి తీర్చుకోవచ్చని ట్వీట్ చేశారు కవిత.
Related Link: మీ ఇంటికే ఫుడ్ - కాల్ టు...
Comments
Post a Comment
Your Comments Please: