Photos Credit: OBN, NP News24
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పితృవియోగం సంభవించింది. 71 ఏళ్ల వయసున్న ఆనంద్ సింగ్ బిష్ట్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చనిపోయారు. కిడ్నీ సంబంధ సమస్యలతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తండ్రి మరణవార్త తెలిసే సమయానికి అక్కడ యూపీలో సీఎం ఆదిత్యనాథ్ కోవిడ్-19 లాక్ డౌన్ అమలుకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఉన్నారు. రేపు ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో తండ్రి అంత్యక్రియలు జరుగుతాయి. అయితే తండ్రి మరణం తనకు ఎంతో దుఃఖదాయకమని, తండ్రి లేని లోటును ఎవరూ పూడ్చలేరని, తాను తలపెట్టిన అన్ని కార్యక్రమాలకు తండ్రి ప్రోత్సాహం లభించిందని యోగి ఎంతో ఆవేదనతో చెప్పారు. అయినా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా కష్టకాలంలో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాలని, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తాను కుటుంబ సభ్యుల్ని కలుస్తానని ఆదిత్యనాథ్ చెప్పడం విశేషం. తన తండ్రి కర్తవ్య నిర్వహణ గురించి చెప్పిన అంశాలనే తాను పాటిస్తున్నానని, తండ్రికి ఇచ్చే నివాళి తన విధ్యుక్త ధర్మ నిర్వహణలోనే ఉందని యోగి చాలా సాదాసీదాగా చెప్పడం విశేషం.
Comments
Post a Comment
Your Comments Please: