Skip to main content

పట్నంలో అద్దె బాధలు తీర్చిన ఆపద్బాంధవుడు


దినసరి కూలీగా వచ్చి పేదల మనసుల్లో గుడి కట్టుకున్న బాలలింగం


కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు, పొట్ట చేత పట్టుకొని దూర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు వీధిపాలవకుండా కొందరు ఆపద్బాంధవులు ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతినెలా ఫస్టు రాగానే ఇంటి అద్దెల కోసం టీనెంట్స్ వెంట పడే ఆసాములు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అడుగడుగునా ఉంటారు. అయితే తాను మాత్రం అలా కాదంటూ ఓ ఆపన్నహస్తం ముందుకొచ్చింది. కరోనా సమయంలో తనకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని పెద్దమనసు చేసుకున్న యజమాని తన టీనెంట్స్ కి భరోసా ఇవ్వడం ఎందరో యజమానులకు స్ఫూర్తిదాయకంగా మారింది. 


Also Read: రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు


హైదరాబాద్, బాలానగర్ లో ఉంటున్న కోడూరి బాలలింగంను మా ప్రతినిధి ఫోన్లో పలకరించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లానుంచి చాలా ఏళ్లక్రితం పని వెదుక్కుంటూ హైదరాబాద్ వలస వచ్చిన బాలలింగం పెద్దగా చదువుకోలేదు. బతుకుబండి లాగేందుకు బార్ లో పాత్రలు క్లీన్ చేసే పనికి కుదురుకొని.. అలా నెమ్మదిగా ఓ మిత్రుడి సాయంతో మెకానికల్ వర్క్ షాప్ పెట్టుకొని చిన్నపాటి యజమానిగా మారారు. ఆ విధంగా దశ తిరిగిన బాలలింగం పలు చోట్ల సొంత ఇళ్లు కట్టుకున్నారు. తానుండేది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి... అక్కడి పరిశ్రమల్లో పనిచేసేది చాలావరకు లేబర్సే. తన ఇళ్లలో అద్దెకు ఉండేది కూడా లేబర్సే కావడం వల్ల... ఈ కరోనా విసిరిన పంజా కారణంగా... వారి కష్టాలను స్వానుభవంగా గ్రహించిన బాలలింగం.. ఏప్రిల్ నెలకు టీనెంట్స్ కు అద్దె నుంచి మినహాయింపునిచ్చినట్లు భాగ్యనగర్ పోస్ట్ కు వివరించారు. రెంట్ల నుంచి 75 మంది టీనెంట్స్ కి ఉపశమనం ఇవ్వడం ద్వారా బాలలింగం రూ. 3.2 లక్షలు వదులుకున్నట్టయ్యింది. తన ఇళ్లలో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన కూలీలే కావడం వల్ల.. వారు చెల్లించలేని అశక్తతను అర్థం చేసుకున్న ఈయన ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో వారంతా టీనెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే తనలాగా ఇతరులు కూడా స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని బాలలింగం అభిప్రాయపడుతున్నారు. 



ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కార్మికుల కుటుంబాలకు అండగా..


ఇది కాకుండా డబ్బు అవసరం ఉన్న పేదలను ఆదుకోవడం బాలలింగానికి అలవాటు. కరోనా సీజన్లో దాదాపు 250 మంది వరకు ఆయన 2.5 లక్షల రూపాయలు అందజేశారు. అలా ఇప్పటివరకు కోటి 20 లక్షల రూపాయల నగదు పంపిణీ చేయడం విశేషం. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కార్మికుల పట్ల ఎంతో ఉదారతను ప్రదర్శించడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో వలంటీర్లుగా విద్యాబోధన చేసేవారికి వేతనాలు చెల్లించారు. ఇలా చెప్పుకుంటే పోతే మనసు స్పందించిన ప్రతిసారీ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు బాలలింగం. సమాజానికి ఆపత్కాలం సంభవించినప్పుడు ఇలాంటి కొందరే తాము చిన్నవాళ్లే అయినా పెద్దమనసున్న పెద్దలుగా వ్యవహరించి నడిపిస్తుంటారని పలువురు బాలలింగాన్ని ప్రశంసిస్తున్నారు. 


నోట్ - ఈ ఆపత్కాలంలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఇంటి అద్దెల నుంచి టీనెంట్స్ కు రిలీఫ్ ఇవ్వడం తక్షణావసరం. అందుకోసం ఈ లింక్ ను క్లిక్ చేసి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి. 


ఇంటి అద్దె మినహాయింపు కోసం క్యాంపెయిన్


News to follow: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.