గ్రేటర్ హైదరాబాద్ లో అందరికీ ఆహారం అందించేందుకు తెలంగాణ సర్కారు కొత్త తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాని ప్రకారం 040-21111111 ల్యాండ్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలి. అక్కడ రికార్డయ్యాక వారు మరో సెల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ దగ్గరే కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫుడ్ ఎక్కడికి చేర్చాలి అనే వివరాలు అడిగి నోట్ చేసుకుంటారు. ఆ నెంబర్లు 9154170990 లేదా 9154170991 కు డయల్ చేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా ఇదే నెంబర్ కు డయల్ చేసినా ఆహారం అందించాల్సిన అడ్రస్, వివరాలు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం కోసం ఉదయం 10 గంటల వరకు కాల్ చేయాలి. అలాగే సాయంత్రం భోజనం కోసం 4 గం. వరకు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది.
ఆ తరువాత ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ ను బట్టి అన్నపూర్ణ క్యాంటీన్ సిబ్బంది.. సమీపంలోని సెంటర్ కు వచ్చి కాల్ చేస్తారు. ఆ కాల్ ను అనుసరించి ఫుడ్ ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Post a Comment
Your Comments Please: