ప్రపంచమంతా రంజాన్ కు సిద్ధమైంది. ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే కరోనా అనే మహమ్మారి మన పక్కనే పొంచి ఉన్న కారణంగా పండుగ సంబరంలో పడిపోయి జాగ్రత్తలు విస్మరించరాదని నిపుణులు సూచిస్తున్నారు. హేపీ రంజాన్ కోసం ఈ కింది సూత్రాలు పాటిస్తే పండుగ ఆనందాన్ని మన కుటుంబ సభ్యులకు పంచిన వారమవుతాం.
1) రంజాన్ ప్రవేశించింది కాబట్టి.. పండుగ కోసం కరోనా రూల్స్ ని మినహాయిద్దాం అన్న తలంపు చేయరాదు.
2) ప్రార్థనలు ఇళ్లలోనే ఉండి చేసుకోవాలి. మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు చేయాలన్న ఆలోచన చేయరాదు.
3) ఏ ఒక్కరు మసీదులోకి వెళ్లినా ఇంకొకరు రూల్స్ బ్రేక్ చేయడానికి అవకాశం ఇచ్చినవారవుతారు. అది పూర్తిగా వాతావరణం చెడగొడుతుంది.
4) మనం పండుగ సంబరాన్ని ఆస్వాదించాలంటే కరోనా నుంచి సురక్షితంగా ఉండాలి. కాబట్టి ఎవరో బలవంతంగా రూల్స్ రుద్దుతున్నారని కాకుండా స్వచ్ఛందంగా రూల్స్ ని పాటించాలి.
5) బయట కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు ఇంటి నుంచే ప్రార్థన చేసుకోవాలన్న ప్రవక్త సూచనలు గుర్తు తెచ్చుకొని ఆ మార్గాన్ని అవలంబించాలి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లైవ్ లో మాట్లాడిన సందర్బంలో కూడా ఇదే విషయాన్ని ముస్లిం ప్రజానీకానికి ఇవ్వడాన్ని గమనించాలి.
6) అవసరంలో ఉన్న పేదలకు, ఆకలి గొన్నవారికి పట్టెడన్నం పెడితే అలాంటివారిని అల్లా అనుగ్రహిస్తాడని గుర్తించాలి.
7) దేశ రాజధాని ఢిల్లీలో అజాన్ కూడా ఇవ్వొద్దని మసీదుల పెద్దలకు పోలీసులు చెబుతున్నారు. అజాన్ ఇస్తే దాన్ని పిలుపుగా భావించి సామాన్య ముస్లింలు పెద్దసంఖ్యలో గుమిగూడే పరిస్థితులు తలెత్తి, మళ్లీ మొదటికే మోసం వస్తుందని వారు ప్రచారం చేస్తున్నారు. దాన్నే మనదగ్గర కూడా పాటిస్తే అందరికీ మంచిది.
Comments
Post a Comment
Your Comments Please: