లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావడం, ఉపాధి అవకాశల్లేక నెల రోజుల పైగా గడవడంతో వలస కూలీల ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో మాతృభూమి ఫౌండేషన్ మరోసారి ముందుకొచ్చింది. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వరుసగా ఉపాధి కోల్పోయిన పేదలకు, మురికివాడల్లో ఉన్నవారికి, వలస కూలీలకు ఆహార సరుకులు అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 30వ తేదీన బిహార్ నుంచి వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలు 50 మంది సరుకులు అందజేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ వద్ద పెద్దసంఖ్యలో కేంద్రీకృతమై ఉన్న వలస కూలీలను గుర్తించి వారికి ఈ సరుకులు అందజేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు కె.కిరణ్ చెప్పారు.
తమ శక్తి మేరకు, ప్రజలకు తమ సేవలు అవసరం ఉన్నంతమేరకు స్పందిస్తామని కిరణ్ తెలిపారు.
Comments
Post a Comment
Your Comments Please: