మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కో-కన్వీనర్ అజయ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ కు, అలాగే ఇతరవర్గాల్లోని పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్లంపేట్ 22వ వార్డు కార్పొరేటర్ సంధ్యాహన్మంతరావు, మేడ్చల్ తెలంగాణ జాగృతి యూత్ కన్వీనర్ పడాల మనోజ పాల్గొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆశయాలను... ఈ విధంగా ముందుకు తీసుకెళ్తునందుకు సంతోషంగా ఉందని సంధ్య, మనోజ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ముప్పు తొలగిపోయేంతవరకు జాగ్రత్తగా ఉండాలని పిలువునిచ్చారు. ఇప్పుడు రంజాన్ కూడా ఉన్నందున హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: