Photo Credit: NP News24
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన కర్తవ్య నిష్టను ప్రదర్శించారు. 71 ఏళ్ల తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆస్పత్రిలో మరణించిన సమయంలో కరోనా వైరస్ కట్టడికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న యోగి... మంగళవారం ఉత్తరాఖండ్ లో జరిగే తన తండ్రి అంత్యక్రియలకు సైతం తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరు కావద్దని, లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలందరూ దీన్ని పాటించాలన్నారు. ఈ నిర్ణయంతో యోగి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలోనే గాక జనరల్ మీడియాలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం
తండ్రి అంత్యక్రియలకు యోగి దూరం
ఇక సెక్యులరిస్టులుగా చెప్పుకునే కొంతమంది సూడోలు ఇటీవల మర్కజ్ కు వెళ్లివచ్చిన కోవిడ్ పాజిటివ్ కేసులపై దుమారం రేగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాక్ డౌన్ ఉన్న సమయంలోనే అయోధ్యకు వెళ్లాడని, దాన్నెందుకు విస్మరించారని అక్కసు బయట పెట్టుకున్నారు. తబ్లిగీ జమాత్ కు హాజరైనవారివల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్ని పేపర్లు, అన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నా... దాన్ని పట్టించుకోని సూడోలకు యోగి ప్రదర్శించిన ఔదార్యం ద్వారా సరైన జవాబిచ్చినట్టయిందంటున్నారు విశ్లేషకులు. అలాగే 2 రోజుల క్రితమే కర్నాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి కుమారుడి పెళ్లి సందర్భంగా కూడా లాక్ డౌన్ నిబంధనలు అపహాస్యం పాలయ్యాయి.
Comments
Post a Comment
Your Comments Please: