చచ్చినవాడు పుడతాడో లేదో గట్టిగా చెప్పే శక్తి సామర్థ్యాలు మనకు లేకున్నా.. పుట్టినవాడు కచ్చితంగా చచ్చి తీరుతాడనేది మాత్రం తిరుగులేని సత్యం. ఆ సత్యాన్ని తిరగరాద్దామని మనవాళ్లు ఎన్నో వేల కోట్ల డాలర్లు వెచ్చించి ప్రయోగాలు చేస్తున్నా ఇప్పటికైతే ఆశావహమైన ఆనవాళ్లేమీ కనిపించలేదు. ప్రపంచ మానవ జీనోమ్ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం కూడా అదేనని ఆ మధ్య మీడియా అంతా వివిధరకాల కథనాలు గుప్పించింది. మనిషి మరణాన్ని అధిగమించబోతున్నాడని, ఆ సుదినం దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊరించారు. అలాంటి ప్రయోగాల్లో కనీసం అంగుళం కూడా ఫలితం సాధించినట్టు రుజువులైతే లభించలేదు. అయితే ఇప్పుడు ప్రపంచ మానవుడు మృత్యువును జయించే ప్రయోగాలు దేవుడెరుగు.. అసలు కంటికి కనిపించనంత అతి చిన్న వైరస్ కణానికే భయపడి చస్తున్నాడు. ఇలాంటి వైరస్ ఇప్పటివరకు మనిషి కంట పడలేదు. కరోనా ఉన్నట్టు గుర్తించారు కానీ.. అది చూపించే ప్రభావం మనిషి అనుభవంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ మాయావి వైరస్ పంజా ఎంత విస్తృతంగా ఉందో అనుభవంలోకి వస్తోంది.
భూతల స్వర్గం అమెరికాలో చనిపోయినవారి శవాలను వారి బంధువులకో, తెలిసినవారికో అప్పగించడానికి కూడా సమయాభావం ఏర్పడుతోంది. కోవిడ్ మృతుల శరీరాలను పాతరేయమని తొందర చేస్తోంది. కరోనా సోకినవారి అనామక డెడ్ బాడీస్, అలాగే సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించే శక్తి లేనివారికి చెందిన బంధువుల డెడ్ బాడీస్ ని సామూహికంగా పాతరేసే కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికాలో శుక్రవారం ఒక్క రోజులోనే 2 వేల మంది చనిపోయారు. న్యూయార్క్ సిటీకి సంబంధించి శవాలను హార్ట్ ఐల్యాండ్ శ్మశానవాటికలో ఖననం చేస్తారు. అయితే కరోనా వైరస్ తో చనిపోయినవారితో పాటు రోజూ వచ్చే అనాథల శవాలు, అంత్యక్రియలు నిర్వహించే శక్తి లేనివారి శవాలతో శవపేటికలు క్యూ కట్టాయి. దీంతో ఒక పెద్ద గొయ్యి తీసి సామూహిక ఖననం చేయాల్సి వచ్చింది. అంతకన్నా భయంగొలిపే అంశం ఏంటంటే... కరోనా మృతులను ఎక్కువ సేపు ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న నిపుణుల సూచనలతో న్యూయార్క్ మేయర్ సామూహిక ఖననానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడిదే విషయంపై మనం కొంత క్లీన్ అండ్ క్లియర్ గా మాట్లాడుకోవడం మంచిది.
Photo Credit: Satellite image ©2020 Maxar Technologies
పూడ్చేస్తే మంచిదా? కాల్చేస్తే మంచిదా?
కరోనా విశ్వరూపం మానవుడికి ఇప్పటికైతే అంతు చిక్కలేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన సర్వే ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన కోవిడ్ సర్వేలో 104 మందికి పాజిటివ్ గా తేలితే వారిలో 40 మంది మాత్రం వ్యాధిగ్రస్తులెవరితోనూ కాంటాక్టు కాలేదని తేలింది. మరి ఎలాంటి కాంటాక్టు లేకపోయినా వీరికి కరోనా వైరస్ ఎలా అటాక్ అయ్యింది? ఇది నిర్ధారణ అయితే తప్ప.. మరిన్ని కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే గనక నిజమైతే లాక్ డౌన్ ని మరింత శాస్త్రీయంగా మదింపు వేయాల్సి రావచ్చు. సింధ్ నుంచి వచ్చి ఇండోర్ లో సెటిలైన వైద్యుడికి రెండుసార్లు నెగెటివ్ వచ్చినా కరోనాతో మరణించాడని రుజువవడం.. ఐసీఎంఆర్ ఆందోళన రెట్టింపు చేస్తోంది. ఒకవేళ ఆ అనుమానాలే నిజమైతే... ముందున్నవి భయంకరమైన గడ్డురోజులేనని చెప్పకతప్పదు.
Also Read: నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?
రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు
ఇక అసలు విషయానికి వద్దాం. ఇండియాలో మరణాల రేటు ప్రతిరోజూ ప్రతి వెయ్యి మందికి 7.5 గా CIA ఫ్యాక్ట్ బుక్ చెబుతోంది. ఆ లెక్కన రోజుకు సుమారు 22 వేల 500 మంది వేర్వేరు మార్గాల్లో మరణిస్తున్నారు. ఇక యేటా ఇది దాదాపు 84 లక్షలుగా ఉంటుంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని కలుపుకోవాలి... అలాగే రోడ్డు ప్రమాదాలను తీసేయాలి. అలా చేస్తే మళ్లీ దాదాపుగా అంతే స్థాయిలో రోజువారీ మరణాలు ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న మరణాలనే రేపు ఇండియా కూడా నమోదు చేస్తే పరిస్థితి ఏంటి? అక్కడ జనాభా తిప్పితిప్పి కొడితే 50 కోట్లు. మన జనాభా 135 కోట్లకు సమీపంలో ఉంది. ఇక వారి వైశాల్యం మనకన్నా మూడురెట్లు ఎక్కువ. వాళ్లు డెడ్ బాడీస్ ని ఖననం చేసుకోవడానికి చాలినంత స్థలం ఉంది. ఆ విషయంలో వారికి కొరత లేదు. కానీ మన సంగతో. ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో శ్మశానవాటికల సమస్య క్లిష్టతరంగా మారింది. పెద్ద పట్టణాల్లో అయితే ఎవరైనా చచ్చారు అంటే... ఆ ఇంటి యజమానికే చావొచ్చినంత పనవుతోంది. ఆయా మత సంప్రదాయాలను బట్టి ఖనన, దహన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి, అలాగే రేపటి మన జనాభా అవసరాలను గుర్తించి ఈ విషయంలో ప్రజలందరూ కామన్ ఒపీనియన్ కు రావాల్సిన అవసరం ఉంది. దహనం వల్ల స్థలాభావం సమస్య పెద్దగా ఉండదు. ఎటొచ్చీ ఖననాలతోనే. క్రిస్టియన్లు, ముస్లింలు తప్పనిసరిగా ఖననం చేస్తారు. హిందువుల్లో కొందరు కూడా ఖననాన్ని సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. అలాగే మిగతా మత సంప్రదాయాలు పాటిస్తున్నవారు కూడా దహన సంస్కారాల్లోకి మారిపోవడమే శ్రేయస్కరం.
Also Read: 15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది
ఆనందం ఆవిరైన సౌత్ కొరియా.. మరి చైనా సంగతేంటి?
Photo Credit: Deccan Chronicle
ఇప్పటికే హైదరాబాద్ లో ఒక క్రిస్టియన్ చనిపోతే శ్మశానవాటిక కోసం 50 వేల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోంది. అనేక గ్రేవ్ యార్డ్స్ పూర్తిగా నిండిపోయి... ఇకపై కొత్త శవాలను తీసుకోలేని స్థితిలో ఉన్నాయి. దీనివల్ల నిర్వహణ పెనుభారంగా మారింది. అటు స్థలం ఎలాగూ పెరిగేది కాదు. ఖర్చులు మాత్రం తడిసి మోపెడు అవుతున్నాయి. అలాగే ముస్లింల శ్మశానవాటికలు కూడా లెక్కలేనన్ని సమాధులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. కొత్త డెడ్ బాడీస్ ని ఇక ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. అందువల్ల నిర్వహణ లోపాల కారణంగా అనుకోని వైరస్ ఏదైనా వాతావరణంలోకి ప్రవేశించి ప్రజల మీద దాడి చేస్తే అప్పుడదో పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకని... కరోనా కారణంగా ప్రజలంతా మతాలకు అతీతంగా లాక్ డౌన్ కి సామూహికంగా సహకరిస్తున్న క్రమంలో అటు అన్ని మతాల పెద్దలు, ప్రభుత్వాధికారులు, సామాజిక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దీనిపై సీరియస్ గా చర్చించి కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తే రానున్న ప్రమాదాన్ని ముందుగానే నివారించినవారమవుతాం.
Comments
Post a Comment
Your Comments Please: