బాలీవుడ్ భామ కంగనా రనౌత్ అపర కాళికావతారం ఎత్తింది. ఈ ట్విట్టర్ పిట్ట గొంతు పిసికేయాలని ప్రధాని నరేంద్రమోడీ సర్కారుతో వినమ్రంగా వేడుకుది. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా పక్షపాతం చూపిస్తే.. అలాంటి సామాజిక మాధ్యమాలు అరాచకాలు సృష్టిస్తాయి మహా ప్రభో... తక్షణమే ట్విట్టర్ గాణ్ని నిషేధించిపారెయ్యండి... అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో రికార్డు చేసింది.
ఉన్న భావస్వేచ్ఛను హుందాగా వాడుకునేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే భావస్వేచ్ఛను ఉపయోగించుకొని చేసిన సామాన్య కామెంట్లకు కూడా లౌకికత్వం మంటగలిసిపోతోందని ఇల్లెక్కి లొల్లి చేసే వాళ్లతో వేగడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ విషయంలోనే కంగనాకు కాలుకొచ్చింది. తబ్లిగీ జమాత్ కు వెళ్లినవారికి వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు, వారిని కన్విన్స్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు తబ్లిగీ తమ్ముళ్లు.. తమను కాపాడేందుకే ప్రభుత్వాధికారులు ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించక.... వారి మీద దాడులకు తెగబడుతున్నారు. దీనిమీదనే కంగనా చెల్లెలు.. రంగోలీ తన ట్విట్టర్ అకౌంట్ లో డాక్టర్ల మీద, పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నవారిని కాల్చేపారేయాలని ట్వీటింది. ఆ ట్వీట్ ను ఆసరా చేసుకున్న బాలీవుడ్ క్యారెక్టర్లు.. ఫరా ఖాన్ అలీ, రీమా కగ్తీ.. అది ముస్లింలను డైరెక్టుగా, వారిని ఊచకోత కోయాలని రంగోలీ ట్వీటిందని వీళ్లు ట్వీటారు. ఆ ట్వీట్ మీద మరికొందరు అత్యుత్సాహవంతులు రంగోలీ మీద చెలరేగిపోవడంతో ట్విట్టర్ వాడు కాస్తా ఆమె అకౌంట్ ను ఊడపీకాడు. దీంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చి ఈ విధంగా వీడియో చేసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: దేశద్రోహం కేసులో బెయిల్ రాకపోతే ముస్లింల పట్ల వివక్ష అవుతుందా?
ఇండియాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవాళ్ల అకౌంట్లు సేఫ్ గా ఉంటాయి.. మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవాళ్ల అకౌంట్లు కూడా సేఫ్ గా ఉంటాయి.. అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప వ్యక్తులను, సంస్థలను టెర్రరిస్టులుగా చిత్రిస్తున్నవాళ్ల అకౌంట్లు కూడా సేఫ్ గా ఉంటాయి.. కానీ పోలీసులు, వైద్యుల మీద దాడి చేస్తున్నవారిని షూట్ చేయాలన్నవారు దేశద్రోహులా? వారి అకౌంట్లను డిలీట్ చేసే ఇలాంటి సోషల్ మీడియా సంస్థలు మన దేశంలో అవసరమా? అంటూ ఆవేశంగా ప్రశ్నించింది కంగనా.
తాను గానీ, తన చెల్లెలు గానీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని, వైద్యుల మీద, పోలీసుల మీద ముస్లింలు దాడి చేస్తున్నారని, వారిని షూట్ చేయాలని ఎక్కడ అన్నారో నిరూపించాలని సవాల్ విసిరింది. మరి కంగనా మాట్లాడింది రైటే కదా. భావ స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది కదా. ఫలానా స్కూల్లో చదువుకున్నంత మాత్రాన తాము ఒక్కరికే భావస్వేచ్ఛ వర్తించాలని, అది వాడుకున్న వేరే ఎవరైనా దేశద్రోహులేనని ఎక్కడైనా రాసి ఉందా? మరి దీనికి ట్విట్టర్ సమాధానం చెప్తుందా... లేక భావ స్వేచ్ఛ బ్యాచ్ సమాధానం చెప్తుందా? వేచి చూద్దాం.
Ref: Kangana Ranaut Asks Govt to ‘Demolish’ Twitter In India
Comments
Post a Comment
Your Comments Please: