Imp Link: అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం
కరోనా విశ్వరూపం అనూహ్యమైన ఉపద్రవంగా మారబోతుందా? ఇదే అనుమానం ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తోంది. కరోనాను చాలా తొందరగా అధిగమించామనుకుంటున్న దేశాలకు వణుకు పుట్టిస్తోంది. క్వారంటైన్ లో ఉండి కోలుకున్న దాదాపు వంద మంది సౌత్ కొరియా కోవిడ్-19 పేషెంట్లు ఎంతో నిబ్బరంగా రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే వారికి నిర్వహించిన పరీక్షల్లో మళ్లీ పాజిటివ్ తేలడంతో వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా అదుపులోకి వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ ట్రెండ్ ఏంటో అవగతం కావడం లేదని సౌత్ కొరియా వ్యాధి నిరోధక శాఖ డైరెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?
సౌత్ కొరియాలో కరోనా అదుపులోకి రావడంతో ఇప్పటికే పాఠశాలలు తెరిచారు. జనజీవనం మీద, జన సంచారం మీద ఆంక్షలను పరిమితం చేయడంతో రోజువారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే వారి ఆందోళనకు కారణమవుతోంది. ఈ క్రమంలో చైనా పరిస్థితేంటి అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్నాయి. వుహాన్ లో కరోనా కొత్త కేసులు జీరో స్టేటస్ కి తీసుకొచ్చిన క్రమంలో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. దీంతో లక్షలాది మంది వుహాన్ సరిహద్దులు దాటి సమీపంలో ఉన్న పట్టణాలకు రాకపోకలు యథేచ్ఛగా సాగించారు. ఇన్నాళ్లూ లాక్ డౌన్ లో ఉన్న వెరపు తీర్చుకునేందుకు జనమంతా పట్టణాల మీద ఎగబడ్డారు. మరి సౌత్ కొరియా అనుభవం నేపథ్యంలో చైనా మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
Comments
Post a Comment
Your Comments Please: