ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి కేజీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, చెప్పుడు మాటలు విని ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు.కరోనా వైరస్ వల్ల రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశామని, నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని, గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.పెట్టుకున్న అంచనాకు 30 శాతం అంటే 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అంటే 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు పంపడం జరిగిందన్నారు. ఈరోజు వరకు రూ. 123 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.
జిల్లాలో నియోజకవర్గాలవారీగా సేకరించిన వరి ధాన్యంలో నిజామాబాద్ రూరల్ లో 86%, బాల్కొండలో 85%, ఆర్మూర్ లో 87%, బోధన్ లో 98%, బాన్సువాడలో 99% రైస్ మిల్లర్ల దగ్గర అన్ లోడ్ అయిందన్నారు. ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గురువారం 25 అదనపు వాహనాలు సమకూర్చారు.గడిచిన 24 గంటల్లో 504లారీల్లోని ధాన్యం రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.ధాన్యం చెడిపోయిందన్న సాకుతో కానీ, కడతా పేరుతో కానీ రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Comments
Post a Comment
Your Comments Please: