లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కూలీలు, ఉపాధి లేనివారికి ప్రణవి ఫౌండేషన్ తోడ్పాటునందించింది. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కష్టాలు చుట్టుముట్టడంతో భోజన సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న పేదప్రజలు ఉండే కాలనీ మాణికేశ్వరీ నగర్, ఒడ్డెర బస్తీలో తాజాగా ప్రణవి ఫౌండేషన్ వంట సరుకులు అందజేసింది. బియ్యం, గోధుమపిండి, ఉల్లిగడ్డ, మిర్చి, పసుపు ఇత్యాది వంట సరుకులను ఫాండేషన్ సమకూర్చింది. ప్రణవి ఆధ్వర్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి విడతలవారీగా తాము వంటసరుకులు పంపిణీ చేస్తున్నామని, తమ ఫౌండేషన్ తో పాటు పేద ప్రజల సేవలో మరికొందరు ఔత్సాహికులు కూడా తమను ప్రోత్సహిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షుడు జైన్ కుమార్ ఆచార్య వారికి కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ మరింతకాలం పొడిగించే అవకాశం కనిపిస్తున్నందున ఔత్సాహికుల నుంచి ఇదే తరహా స్ఫూర్తి కొనసాగాలని జైన్ కోరారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్, ఇమ్రాన్, కె.వెంకటరమణ, జి.మోహన్, ఎస్.రాధాకృష్ణ, జి.ఆనంద్ ఆచార్య, రమేశ్ నాయక్, సామేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: