కరోనా సృష్టించిన కల్లోలంతో నిరుపేదలు, రోజు కూలీలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతగా విశ్వకర్మ ఎంప్లాయీస్ డెవలప్ మెంట్ అండ్ సర్వీసెస్ అసోసియేషన్ (వేదాస్ అసోసియేషన్) హైదరాబాద్ కమిటీ ముందుకొచ్చింది. అంబర్ పేట, పటేల్ నగర్ లో ఉన్న విశ్వబ్రాహ్మణల్లోని పేద కుటుంబాలకు 5 కిలల బియ్యం, పప్పు, కారం వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు అర్నోజి జైన్ కుమార్ ఆచార్య, కార్యదర్శి ఎన్. సుధాకరాచారి ఇందుకోసం పూనుకున్నారు. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ అనేది లాక్ డౌన్ ఎత్తేసేవరకు కొనసాగుతుందని, వేదాస్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కుటుంబాలకే గాక ఇతర వర్గాల్లోని నిరుపేదలకు కూడా అందిస్తామని చెప్పారు. సామాజిక దూరాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్న దృష్ట్యా తామే ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పారు. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి ఆకాంక్ష మేరకు తాము హైదరాబాద్ లో ఈ కార్యక్రమం తీసుకున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేదాస్ రాష్ట్ర మీడియా వింగ్ ఇంచార్జి రమేశ్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక వేదాస్ నాయకుడు సామేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Readable Articles: చైనా పెట్టుబడులకు ఇండియా చెక్
2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ
పట్నంలో అద్దె బాధలు తీర్చిన ఆపద్బాంధవుడు
Comments
Post a Comment
Your Comments Please: