కరోనా కష్టకాలంలో మీడియా యాజమాన్యాల నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఎలాంటి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సగటు జర్నలిస్టుల కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ చేయూతనందిస్తున్నారు. తన పరిధిలో ఇప్పటికే చౌటుప్పల్, నల్గొండ వంటి కేంద్రాల్లో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన రవికుమార్, తాజాగా మునుగోడులో ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. కరోనా సాకుతో మీడియా సంస్థలు ఇప్పటికే పలువురు జర్నలిస్టులను పక్కన పెట్టేశాయి. అటు ఫీల్డులో పనిచేసే రిపోర్టర్లు సైతం రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఆహార సరుకులే కాక, తక్షణావసరాల కోసం డబ్బు కూడా వారి అకౌంట్లలో జమ చేయాలని, జర్నలిస్టు కమ్యూనిటీ కూడా పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మాదిరే కరోనా బారిన పడుతున్నారని, అలాంటివారి కోసం మీనమేషాలు లెక్కించరాదని రవికుమార్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా కూడా అదే విజ్ఞప్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి చేశారు.
ఈ కార్యక్రమంలో TJF రాష్ట్ర నాయకుడు పోగుల ప్రకాష్, జిల్లా నాయకులు ఈదులకంటి కైలాష్, తిరందాస్ శ్రీనివాస్, తీరుపారి వెంకటేశ్వర్లు, మాదగోని భిక్షం, మునుగోడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముడుపు శ్యామ్ సుందర్ రెడ్డి, కార్యదర్శి పోలగోని విజయ్ కుమార్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: