కరోనా అలజడి మరింత ముదిరిపోకముందే దానికి చెక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మణిపూర్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ సిబ్బంది ఎంట్రీకి అవకాశం ఇవ్వకపోవడం వార్తాంశమైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్న స్టార్ సూపర్ మార్కెట్ కు ఇద్దరు రోహింగ్యాలు నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు వెళ్లారు. చూడగానే వారు విదేశీయుల్లాగా కనిపించారు అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి. దీంతో వారిని అనుమానించారు. మీరెవరు అని అడిగారు.
మేం రోహింగ్యాలం.
ఎక్కణ్నుంచి వచ్చారు?
మణిపూర్ నుంచి.
ఐడీ కార్డు చూపించండి అని అడిగారు. వారు ఆధార్ కార్డు చూపించారు. అయినా షాపులోకి ఎంట్రీ అవకుండా యజమాని వచ్చిన తరువాత రావాలని, తామేం చేయలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ సందర్భంలో వారిలో ఒకరు తీసిన వీడియోను వారి మిత్రుడు ట్విట్టర్లో పెట్టడంతో దానిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.
రేసిజం ఏ స్థాయిలో ఉన్నా సహించరాదని, దీనిపై సంబంధిత పోలీసు బాసు యాక్షన్ తీసుకోవాలని, వారి ఆకలి తీర్చే మార్గం వెదకాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆ ట్వీట్ కు రెస్పాండ్ అయ్యి.. ఆ షాపు ఎక్కడుందో చెప్పాలని ఎంక్వైరీ చేయడం విశేషం. ఆ లింక్ ను ఇక్కడ ఇస్తున్నాం.
Link: https://twitter.com/KTRTRS/status/1248168388519546882
Comments
Post a Comment
Your Comments Please: