అనుసరించేవాడు ఫాలోయర్. నడిపించేవాడు లీడర్. ప్రపంచాన్నంతా అమెరికా శాసిస్తుంటే.. అమెరికాను ఇండియా శాసించకపోయినా ఫాలో అయ్యేలా మాత్రం చూసుకుంటోంది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అమెరికా... పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందనేందుకు ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇటీవల కరోనా విజృంభించి మానవాళికి ముప్పుగా పరిణమించిన క్రమంలో ధనిక దేశాలు చాలావరకు ఇండియా వైపే చూశాయి. ఇండియా మీదనే ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా కూడా ఆ జాబితాలోనే ఉండడం అందరం చూసిందే. అమెరికా ఏ స్థాయిలో ఇండియా మీద పూర్తి భరోసాగా ఉందనేందుకు ఇంతకన్నా చెప్పుకోదగ్గ నిదర్శనం అవసరం లేదు.అమెరికా పాలసీకి, పరిపాలనకు అద్దం పట్టే వైట్ హౌస్.. ఇండియాను ప్రముఖంగా ఫాలో అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
Also Read: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అధికారిక ట్విట్టర్ అకౌంట్.. ద వైట్ హౌస్ కు 2 కోట్ల 16 లక్షల పైచిలుకు ఫాలోయర్స్ ఉండగా.. అది మాత్రం కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఐదున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండగా.. 2,300 కు పైగా అకౌంట్ హోల్డర్స్ ను ఆయన ఫాలో అవుతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే... వైట్ హౌస్ నరేంద్ర మోడీని మినహా ఏ ఒక్క ప్రపంచ లీడర్ ను కూడా ఫాలో అవడం లేదు. రెండో అగ్రరాజ్యమైన చైనాధీశుడు జిన్ పింగ్ గానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ గానీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్... ఇలా ఏ ఒక్క అగ్రరాజ్యానికి చెందిన అధినేతను సైతం వైట్ హౌస్ ఫాలో అవడం లేదు. ఆ 19 మంది ఫాలోయర్స్ లో కూడా 5 అకౌంట్లు ఇండియాకు చెందినవే కావడం విశేషం. 1) నరేంద్రమోడీ పర్సనల్ అకౌంట్, 2) పీఎంఓ ఇండియా, 3) ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 4) యూఎస్ ఎంబసీ ఇండియా, 5) ఇండియా ఇన్ యు.ఎస్.ఏ. ఇక మిగిలిన అకౌంట్లు అన్నీ కూడా అమెరికాకు చెందినవే కావడం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఆలోచించండి... ప్రపంచం ఎవరిని గుర్తిస్తుందీ.. ఎవరినీ ఫాలో అవుతుందో.
Ref: PM Narendra Modi only world leader White House follows on Twitter
Comments
Post a Comment
Your Comments Please: