దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్ రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వాట్సాప్ మీద ఆధారపడుతున్న భారతీయుల సంఖ్య ప్రపంచమార్కెట్ లోనే అతిపెద్దది.
Also Read: ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది
ట్విట్టర్ ను నిషేధించాలంటున్న కంగనా
ఈ డాటాబేస్ మీద కన్నేసిన ముఖేశ్ అంబానీ... తాను చేపట్టబోతున్న రిటైల్ మార్కెట్ అండ్ డోర్ డెలివరీకి అద్భుతంగా పనికొస్తుందని అంచనా వేశారు. టెలికాం రంగంలో అగ్రగామిగా ఉంటూ తిరుగులేని రీతిలో దూసుకుపోతున్న జియో కూడా తనకు ఎంతో ఉపకరిస్తుందని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ భావించారు. ఉభయతారకంగా ఉండే వ్యాపార ప్రయోజనాల రీత్యా ఈ ఇద్దరూ చేతులు కలపడంతో భారతీయ రిటైల్ మార్కెట్ స్వరూప స్వభావాలు మారిపోతాయంటున్నారు.కరోనా కష్టాల నుంచి దేశం బయటపడేనాటికే అందుకు అవసరమైన ఆపరేషన్స్ డ్రైవ్ చేసేందుకు డాటాబేస్ ను ఉపయోగించుకునే పనిలో ముఖేశ్ కంపెనీలోని ఇంజినీర్లు తలమునకలై ఉన్నారు. అంటే ప్రజలు, ప్రభుత్వాలు కరోనాకు పరిమితమై కాలక్షేపం చేస్తున్న సమయంలో.. ఆ తరువాతి దేశ ఆర్థిక చిత్రపటాన్ని ముఖేశ్ కల గంటున్నారన్నమాట. ఇవాళ్టి ముఖేశ్ ప్రకటనలో ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పడం, ఈ ఒప్పందం చిన్న వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్ కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం గమనించాల్సిన అంశం. వీరి ఒప్పందంతో చెల్లింపుల దగ్గర నుంచి భారీ సూపర్ మార్కెట్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి.
ట్విట్టర్ కి కష్టకాలమేనా?
ఫేస్ బుక్-జియో ఒప్పందంతో.. సోషల్ మీడియాలో మరో దిగ్గజం లాంటి ట్విట్టర్ కు కష్టకాలం తప్పదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ మీద చాలా కాలంగా దేశవ్యతిరక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న మార్చి 2న తన సోషల్ మీడియా అకౌంట్లు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటివాటిని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన మోడీ దేశవ్యాప్తంగా చర్చకు తెర లేపారు. తన అకౌంట్ల ద్వారా ప్రజాసేవలో, స్వచ్ఛంద సేవలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా కొనసాగుతున్న సామాన్య మహిళలకు పోస్టు చేసే అవకాశాన్నిచ్చారు. చదువుకున్న, దేశవ్యతిరేక భావజాలాన్ని విస్తరించేందుకే ఎక్కువగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియాతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్న చర్చకు మోడీ వీలు కల్పించారు. అయితే దేశ వ్యతిరేక పోస్టింగ్ లను ట్విట్టర్ మాత్రం కావాలనే ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు కూడా ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల అరుంధీరాయ్ లాంటి సెలబ్రిటీ రైటర్ కూడా డీడబ్ల్యూ లో పాల్గొన్న చర్చలో ఒక భాగాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అందులో మోడీ మత విద్వేషాలు చిమ్ముతున్నారని, కరోనా టైమ్ ను ముస్లిం జాతిని హననం చేసేందుకే ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్రంగా ఆరోపించింది. ఆమె అకౌంట్ ఇప్పటికీ ట్విట్టర్లో ఉంది. అలాగే బాలీవుడ నటి కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ చేసిన పోస్టింగ్ కు ఆబ్జెక్షన్ చెప్పిన ట్విట్టర్ వెంటనే ఆమె అకౌంట్ ని తొలగించింది. మెడికల్ టెస్టులకు సహకరించనివారిని కాల్చిపారేయాలని రంగోలీ వ్యాఖ్యానించింంది. అది నేరుగా ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన కామెంటే అంటూ చాలా మంది ఫిర్యాదులు చేసేసరికి ట్విట్టర్ యాజమాన్యం అకౌంట్ ను నిలిపివేసింది. దీంతో కంగనా రనౌత్ ట్విట్టర్ ని ఇండియాలో నిషేధించాలంటూ మోడీకి విజ్ఞప్తి చేసింది. ట్విట్టర్ ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి... అంబానీతో జత కట్టిన ఫేస్ బుక్ ని వదిలేసి రేపటి రోజుల్లో ట్విట్టర్ భరతం పట్టే అవకాశాల్లేకపోలేదు.
Comments
Post a Comment
Your Comments Please: