Skip to main content

Posts

Showing posts from May, 2020

వార్త రాస్తే ఇల్లు కూల్చాలా?

  ఓ గ్రామీణ విలేకరి ఇల్లు కూలింది. పెను దుమారానికో, విపరీతమైన వర్షానికో, లేక  శిథిలావస్తకు చేరుకునో ఆ ఇల్లు కూలలేదు. ఇంకా ఆకృతి  దాల్చని ఆడశిశువు పీక పిసికేసినట్టు ఇప్పుడే పునాదులు పూర్తి  చేసుకొని గోడల దశకు చేరుకున్న ఇల్లు నేలమట్టమైంది. పిల్లాడు ఐస్ క్రీమ్ చీకినంత ఈజీగా ఒక ఎమ్మెల్యే పంపిన మనిషి బుల్డోజర్ మీద వచ్చి ఆ విలేకరి ఇంటిని పునాదులకంటా నేలకు నాకించేశాడు. వార్త రాసి, అది కాస్త డెస్క్ లో ఊపిరి పోసుకొని శాటిలైట్ గుండా ప్రపంచాన్ని పలకరించేసరికి విలేకరికి చాలా సంతృప్తే కలిగి ఉండొచ్చు. ఎందుకంటే.. ఆ వార్త ఏ గల్లీ లీడర్ మీదనో రాసింది కాదు కాబట్టి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారని, దాదాపు 200 మందికి పైగానే పార్టీకి హాజరై.. ఎవరూ మాస్కులు ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఓ నాయకుడే ఇలా కోవిడ్ రూల్స్ కి పాతరేస్తే మరి రూల్స్ ఎందుకు? నాలుక గీసుకోవడానికా ? అన్న నికార్సిన ఆవేదనతో పరమేశ్ అనే వీ6 విలేకరి ఓ వార్తను ఫైల్ చేశాడు. ఆ వార్త కాస్తా ప్లే అయింది. ఎమ్మెల్యే ఇంటికి 200 మంది బంధుమిత్రులు, వెంట ఉండే అనుచరగణం ...

మతోన్మాదం పేదవారికి ప్రథమ శత్రువు

  ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.   యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక...

బతికున్నప్పుడు అవమానించి చచ్చాక ఆదుకుంటారా?

Photo Credit: Business Standard ప్రపంచవ్యాప్తంగా కరోనా మీద వెనుకంజ వేయని రీతిలో యుద్ధం కొనసాగిస్తున్న దేశంగా మన దేశానికి ఒక మంచి పేరు వచ్చింది. అయితే అదే కరోనా మీద యుద్ధంలో రాజీపడటంతో ప్రభుత్వానికి వచ్చిన ఆ మంచిపేరు కూడా నెగెటివ్ గా మారిపోతోంది. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కరోనా మీద ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతుండడం విశేషం. మరోవైపు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి కాలే కడుపులతో కాలి నడకన వందలు, వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్న వలస కూలీలకు ఇప్పటివరకు కేంద్రం వైపు నుంచి చెప్పుకోదగ్గ ఆసరా అందకపోవడం ఆశ్చర్యం గొలుపుతున్న అంశం.  ఈ దేశ ప్రగతి చక్రానికి ఇరుసులా పనిచేసిన వలస కూలీలకు, తమ శ్రమతో, చెమట చుక్కలతో ఉన్నత కుటుంబాలకు ఇంద్ర భవనాలు నిర్మించి ఇచ్చిన అనామక శ్రామికులకు కనీసం లాక్ డౌన్ సమయంలోనైనా రెండు పూటలా నాలుగు ముద్దలు అందించలేకపోయింది మన దేశం. వాళ్ల పూట గడిస్తేనే పెద్దోళ్ల ఏసీలు తిరుగుతాయి. వాళ్ల చెమట చుక్కలు రాలితేనే ఖరీదైన విల్లాలు, రియల్ బిజినెస్ లు స్టాక్ మార్కెట్ తెరల మీద రివ్వుమంటూ దూసుకుపోతాయి. ఏ ఒక్క కార్పొరేట్ బిజినెస్ పేజీలో కూడా వారి కోసం కాసింత చోటు దక్కని సేవామూర్...

కరోనా - ఓ కవి శత కంద పద్య ప్రహేళిక

కవుల మస్తిష్కాల్లోని భావ ప్రపంచం కదిలితే ఏ  రసమైనా ఏరులై పారాల్సిందే. ఆనందమైనా, అద్భుతమైనా, బీభత్సమైనా, కారుణ్యమైనా.. ఆఖరుకు ఇప్పటి కరోనా విసురుతున్న అదృశ్య ఖడ్గ విచలిత విషాదమైనా.. అది ఏ రసమైనా కానీ.. కాలువలు కట్టి ప్రవహింపజేయగలడు కవి. ఆ రస ప్రవాహంలో పఠితలను అలవోకగా తేలియాడించగలడు. భావానందంలో ముంచి బ్రహ్మానంద సీమల మేరువుల వైపు కొనిపోగలడు. అందుకే కవి మనసు పడితే కావ్యకన్యక అందాలు కందాలై పూల తేనియల మకరందాలై కస్తూరికా కదంబాలై కట్టిపడేస్తాయి. అదే జరిగింది ఇక్కడ. సుధాశ్రీ పేరుతో బస్వోజు సుధాకరాచారి కరోనా ప్రస్థానాన్ని, దాని ప్రయాణంలో విశృంఖలత్వాన్ని, సాంస్కృతికంగా అది మోసుకొస్తున్న చైతన్య వీచికలను కందపద్యాల్లో వ్యక్తపరిచారు.    కందం రాయగలవాడే కవి అన్న నానుడిని బట్టి తెలుగు సాహితీ లోకంలో కందానికి ఉన్న కాఠిన్యత, సంక్లిష్టత, విశిష్టతలు ఎలాంటివో గ్రహించవచ్చు. అలాంటి కఠినమైన సాహితీ ప్రక్రియను ఎంచుకొని శతాధిక పద్యాలతో కూడిన అమృత కలశాన్ని సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. అయితే కందం రాసేవారికే కష్టం గానీ.. చదువరులకు చాలా తేలిక. అందుకే తెలుగునాట ప్రాచీన కవులు ఈ ప్రక్రియనే ఎక్కువగా ఎంచుక...

కైలాసనాథుడి చెంతకు ఇకపై రోడ్డు మీదుగా..

హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు.  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ...

మీ ఇంటి ముందుకే లిక్కర్ బాటిల్

నువ్వు నా దగ్గరకు వస్తే సమస్య గానీ.. నేనే నీ దగ్గరకు వస్తే సమస్యే ఉండదు కదా అంటోంది లిక్కర్ బాటిల్. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో వైన్ షాపులు తెరుచుకున్నాయి. వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల భారీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్  డిస్టెన్స్ పాటించడం అనేది ఓ పెద్ద సవాలుగా మారింది. మందు  చుక్క కోసం గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయడం, మందుకోసం ఒకరినొకరు తోసుకోవడం, అటు ప్రభుత్వాల దగ్గర కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఎలా నిర్వహంచాలో ప్లానింగ్ లేకపోవడంతో.. ఈ రంగంలోకి ఫుడ్ డెలివరీ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పని మేం చేస్తామంటూ కొత్త వ్యాపార సూత్రాలతో ముందుకొస్తున్నాయి.  వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి టిఫిన్, మీల్స్ డెలివరీ చేసే జొమాటో ఇకనుంచి లిక్కర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కు ముుందు ఫుడ్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే జొమాటో.. లాక్ డౌన్ తరువాత దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో డెలివరీ బాయ్స్ కు ఉపాధి లేకుండాపోయింది. చాలా వ్యాపార స...

వీళ్లను ఆదుకోవాల్సింది కేసీఆరే-కె.సి.కాళప్ప

కరోనా దెబ్బకు దాదాపు 2 నెలలుగా ఉపాధి కోల్పోయి, కూలీ పని కూడా దొరక్క పేదల కుటుంబాలన్నీ అల్లకల్లోలంగా మారుతున్న క్రమంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలను ఆపద్బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆరే ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో రెక్కాడినప్పుడే పూర్తిగా డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఎంబీసీలు.. కరోనా దెబ్బకు కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని కాళప్ప అభిప్రాయపడ్డారు. కుప్పకూలిన చేతివృత్తులు చేతివృత్తులు, మానవసేవలు అందించే బడుగులు, నిరుపేదలంతా మోస్ట్ బ్యాక్ వార్డ్ కులాల్లోనే ఉన్నారని.. వారిని కాపాడుకోవడం యావత్ సమాజ కర్తవ్యమన్న ఆయన.. అలాంటివారిని కాపాడుకోకపోతే వారి సేవలమీదనే ఆధారపడ్డ అనేక కుటుంబాల పరిస్థితి సంకటంలో పడుతుందన్నారు. హైదరాబాద్ లో నిర్మాణరంగానికి అవసరమైన కూలీలుగానీ, హమాలీలు గానీ, పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు గానీ, అడ్డా మీది లేబర్లు గానీ, ఆఫీసులు-కార్యాలయాలకు వెళ్లే ఉన్నత కుటుంబాల ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, ...

ఎంబీసీల ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ

జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ కాళప్ప ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హైదరాబాద్, ఉప్పుగూడలో అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఎంబీసీ చాంద్రాయణగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా భోజన సదుపాయాలు కరువైన దాదాపు 150 మంది నిరుపేదలు, కాలనీవాసులకు భోజన ప్యాకెట్లు పంచినెట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లలితా బాగ్, మారుతి నగర్, ఉప్పుగూడ, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్ వాసులు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాయి బ్రాహ్మణ సంఘం నుంచి కొడిచెర్ల రమేష్, వాసవి విజయ్ కుమార్, ఏపీజే కలాం అసోసియేషన ఎగ్జిక్యూటివ్ మెంబర్, వలబోజు రవికిరణ్ చారి, శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.   Readable Article: లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?  

లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?

బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం.  కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం  తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా...

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"

శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను ...

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం

మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది.  తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు...

చిత్రమాలిక-వాడవాడలా వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు

రాజయోగి, అద్వైతబ్రహ్మ శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 327వ ఆరాధనోత్సవాలు తెలుగు నేలపై శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. స్వామివారు జీవసమాధి అయిన రోజునే ఆరాధనా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగునాట వస్తున్న సంప్రదాయం. బ్రహ్మంగారు తెలుగు, కన్నడ మూలాలకు చెందిన తత్త్వవేత్త కావడం వల్ల దక్షిణభారత దేశంలో ఆయన బోధనలకు  ప్రాశస్త్యం లభించింది. తత్వవేత్తగానే గాక యోగిపుంగవుడిగా, సామాజిక న్యాయమూర్తిగా, మహిమలు చూపిన మహిమాన్వితుడిగా, కోరిన కోర్కెలు తీర్చిన దేవదేవుడిగా, కాలజ్ఞాన ప్రదాతగా, ప్రళయానంతర కాలమున వెలుగులు ప్రసరింపజేయడానికి వచ్చే పరంజ్యోతిగా.. ఇలా అనేక విధాలుగా బ్రహ్మంగారు తెలుగువారి ఇంటిల్లిపాదికీ ఇష్టదైవం.  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో స్వామివారి ఆరాధనోత్సవాలను సామాజికదూరం పాటిస్తూ తెలుగువారు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని "శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి" రాష్ట్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు "బ్రహ్మశ్రీ వేములవాడ మదన్ మోహన్" స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురుపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువ...