జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ కాళప్ప ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హైదరాబాద్, ఉప్పుగూడలో అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఎంబీసీ చాంద్రాయణగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా భోజన సదుపాయాలు కరువైన దాదాపు 150 మంది నిరుపేదలు, కాలనీవాసులకు భోజన ప్యాకెట్లు పంచినెట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లలితా బాగ్, మారుతి నగర్, ఉప్పుగూడ, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్ వాసులు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాయి బ్రాహ్మణ సంఘం నుంచి కొడిచెర్ల రమేష్, వాసవి విజయ్ కుమార్, ఏపీజే కలాం అసోసియేషన ఎగ్జిక్యూటివ్ మెంబర్, వలబోజు రవికిరణ్ చారి, శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.
Readable Article: లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?
Comments
Post a Comment
Your Comments Please: