నువ్వు నా దగ్గరకు వస్తే సమస్య గానీ.. నేనే నీ దగ్గరకు వస్తే సమస్యే ఉండదు కదా అంటోంది లిక్కర్ బాటిల్. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో వైన్ షాపులు తెరుచుకున్నాయి. వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల భారీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది ఓ పెద్ద సవాలుగా మారింది. మందు చుక్క కోసం గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయడం, మందుకోసం ఒకరినొకరు తోసుకోవడం, అటు ప్రభుత్వాల దగ్గర కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఎలా నిర్వహంచాలో ప్లానింగ్ లేకపోవడంతో.. ఈ రంగంలోకి ఫుడ్ డెలివరీ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పని మేం చేస్తామంటూ కొత్త వ్యాపార సూత్రాలతో ముందుకొస్తున్నాయి.
వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి టిఫిన్, మీల్స్ డెలివరీ చేసే జొమాటో ఇకనుంచి లిక్కర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కు ముుందు ఫుడ్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే జొమాటో.. లాక్ డౌన్ తరువాత దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో డెలివరీ బాయ్స్ కు ఉపాధి లేకుండాపోయింది. చాలా వ్యాపార సంస్థల్లాగే జొమాటో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే ప్రతి చీకటి వెనుక ఓ వెలుగురేఖ ఉంటుంది కదా. అలా వైన్ షాపుల ముందు మందుబాబుల భారీ క్యూలను అవకాశంగా భావించిన జొమాటో... తన సేవలను లిక్కర్ డెలివరీ వైపు మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర టిఫిన్ సెంటర్లకు ఇప్పట్లో ఆదరణ ఉండే అవకాశం లేదు. అవి కొత్తమార్గాన్ని వెదుక్కోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఆ ఇండస్ట్రీ అంతా సంక్షోభంలోకి కూరుకుపోయింంది. అయితే వాటిమీదనే ఆధారపడ్డ జొమాటో కూడా అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న తరుణంలో లిక్కర్ డెలివరీ ఐడియాతో మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేయడం విశేషం. అలాగే జొమాటోకు పోటీగా ఇదే ఫుడ్ డెలివరీలో పనిచేస్తున్న స్విగ్గీ కూడా లిక్కర్ డెలివరీలోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే ఈ సంస్థలు ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఆపరేషన్లు చేపట్టాయి. ఇక రేపోమాపో హైదరాబాద్ లో కూడా లిక్కర్ డోర్ డెలివరీ అవుతుందన్నమాట.
Comments
Post a Comment
Your Comments Please: