కరోనా పాజిటివ్ కేసులు రోజుకు దాదాపు వెయ్యికి చేరుకోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం సీరియస్ గా చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఇలా ఉంటే అసలు టెస్టుల కోసం ఎంత మంది క్యూలో ఉన్నారో చూస్తే జడుసుకోవాల్సిందే. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నొస్టిక్స్ ముందు టెస్టుల కోసం ఎంత మంది లైన్ కట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
అంతేకాదు.. అసలు అనుమానంతో క్యూలో ఉన్నవారి సంగతలా ఉంచితే.. క్యూలో ఉన్నవారికే కరోనా ఉంటే అది లేనివారికి కూడా సోకే పరిస్థితి దాపురించింది. ఎవరు దీన్ని ఆపాలి.. ఎలా ఆపాలి... ఎక్కడ బ్రేక్ పడుతుందో ఆ దేవుడికే తెలియాలని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: