- కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్
------------------
యావత్ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సమావేశాలు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఎవరూ ఏర్పాటు చేయకపోయినా.. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఇతర యాక్టివిస్టులు, అటు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు విడివిడిగా ఎవరి ఇళ్లలో వారే నివాళులు అర్పించి జయశంకర్ సార్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి విజయం సాధించి ప్రజలకు అప్పగించి అనంత లోకాలకేగిన జయశంకరుడు ఆశించిన ఫలాలు మాత్రం సమాజానికి అందడం లేదని, జయశంకరుడి జాతికే చెందిన విశ్వకర్మలు మరీ అణచివేతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ జాతి స్వేచ్ఛ కోసం పోరాడిని జాతి ప్రజలే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆచార్య జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కవితలు
అమరుడు జయశంకరుడు
అమరుడు జయశంకరుడు
నిరాడంబరుడు జయశంకరుడు
తెలంగాణ జాతిపిత జయశంకరుడు
నీళ్లు, నిధులు,నియామకాల కోసం కొట్లాడింది జయశంకరుడు,
తెలంగాణ దిక్సూచి జయశంకరుడు,
తెలంగాణ జాడ జయశంకరుడు,
నీ ఆశయాలు కొనసాగిస్తము.
జోహార్ జయశంకర్ సార్ జోహార్ జోహార్
----------------------
సలాం సారూ
అణచబడ్డ తెలంగాణ అభివృద్ధి
ప్రత్యేక తెలంగాణతోటే సాధ్యమని నమ్మిన సిద్ధాంతాన్ని .........
సిద్ధాంతం గా బోధించిన
ఓ......
తెలంగాణ సిద్ధాంత కర్తా
అలుపెరుగని ఆశయంతో.......
అధికారం అంటే ఆశ కాదు
ఆశయ సాధన అంటూ.......
నిరంతర కృషి పట్టుదలే ఆయుధాలని భోదించి శోధించి......
ఉద్యమనేతగా K C R గారిని ఎన్నుకున్న అభినవ ద్రోణాచార్యా........
నువ్వు కన్న కలలు
మాకు నిజం చేశావ్........
తెలంగాణ గడ్డ ఉన్నన్నాళ్లు
మరవదు ఏ బిడ్డ నిన్ను.......
మీ యాదిలో తొమ్మిదేళ్లు గడిచిపోయాయి.......
అయినా......
తెలంగాణ జాతిపిత గా
మా ప్రొఫెసర్ జయశంకర్ సార్
గారని.....
మన తెలంగాణ సకల జనులు......
మీ గురుతులను గుండెల్లో పెట్టుకుంటారు.......
ఇది సత్యం
ఓ అమరుడా ......
అందుకో
మా అశ్రు నివాళులు .....
,ప్రగతి పథంలో పరుగెడుతూ
అభివృద్ధి ఆశయంగా ఎదుగుతున్న తెలంగాణను
దీవించండి ఆచార్యా ....
జయహో జయశంకరా
జయ జయహో జయశంకరా
మీ తొమ్మిదవ వర్థంతి సందర్బంగా అశ్రునయనాలతో.....
తెలంగాణ విశ్వకర్మ పరిరక్షణ సమితి తరపున మరియు నా తరపున అశ్రు నివాళులు అర్పిస్తూ..
- పసునూరోజు వాసుదేవాచారి, జై విశ్వకర్మ
-----------------
ఖమ్మంలో
వేదాస్, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొ జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న విశ్వబ్రాహ్మణ ఉద్యోగులు, నాయకులు
---------------------
కుత్బుల్లాపూర్ లో
హైదరాబాద్, శ్రీ రావినారాయణ రెడ్డి నగర్ 2, కుత్బుల్లాపూర్ నందు విశ్వకర్మ గాయిత్రి సంఘం, కొండువరపు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో డాక్టర్ కె జయశంకర్ సర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతోజు వెంకటాచారి (విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల) రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షత వహించగా బెల్లపు దుర్గారావు అధ్యక్షులు ( తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల రాష్ట్ర సమితి) ముఖ్య అతిథిగా, అలాగే N. వీరన్న(తెలంగాణ ఎంబీసీ డీఎన్టీ నవ నిర్మాణ సమితి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రవిచారి, వడ్ల అరుణ, సమంత, రఘుచారి తదితరులు పాల్గొన్నారు.
--------------------------
అభిప్రాయాలు
మిత్రులందరికీ నమస్కారం..
ఈ రోజు Prof. Kothapalli Jayashankar Sir వర్ధంతి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహోరాత్రులు తపించి, తెలంగాణకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని, అవమానాలను, వివక్షతను తను పుట్టి బుద్దెరిగిన నాటినుండి, తొలి తెలంగాణా ఉద్యమ కాలంనుండి పోరాడుతూ, అవకాశవాదులు ఉద్యమాన్ని వదిలేసినా, అనేక దశాబ్దాలుగా ఒంటరిగా పోరాడుతూ, ఉద్యమం నిర్మిస్తూ, తెలంగాణ ఎన్ని తీర్ల వెనుకబడేయబడ్డదో అనే జ్ఞానాన్ని తన తోటివారికి, తన శిష్యగణానికి బోదిస్తూ, ఉద్యమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సభలు సమావేశాలు నిర్వహిస్తూ సంఘాలను ఏర్పాటు చేస్తూ, అనేక నిర్భంధాలను ఎదుర్కొంటూ, అనారోగ్యం పాలవుతూ, మలి దశ ఉద్యమ చివరి అంకంలో ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తున్న తొలి ఉదయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అనారోగ్యం పాలై జయశంకర్ సార్ ఇదే రోజు జూన్ 21న అస్తమించాడు.
ప్రతి అస్తమయం ఒక తొలి ఉదయాన్ని అందిస్తుంది. ఇది ప్రకృతి ధర్మం.
జయశంకర్ సార్ తెలంగాణబిడ్డగా తెలంగాణ జాతిని మేల్కొలిపి తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫలంగా పెట్టి త్యాగజీవి అయినాడు. తెలంగాణ జాతిపితగా మారినాడు.
సార్ వర్ధంతి సందర్భంగా
VEDAS Association TS శ్రధ్ధాజలి 🙏ఘటిస్తున్నది.
రాష్ట్ర కమిటీ,
VEDAS Association, TS.
--------------------
జై విశ్వకర్మ, జై వేదాస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు అహరహం శ్రమించి,తొలి, మలి దశ ఉద్యమాలకు ఆద్యుడిగా నిలిచి,ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా ఉండి,ప్రత్యేక రాష్ట్రం కల సాకారం కావడానికి ముఖ్య కారకు లై, విశ్వకర్మ జాతికే వన్నె తీసుకు వచ్చిన ప్రొ: జయశంకర్ సార్ గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము.మనమందరము వారి అడుగుజాడల్లో నడిచి మన విశ్వకర్మ జాతికి,హైందవ సంస్కృతికి, దేశానికి వన్నె తీసుకురావాలని కోరుకుంటూ వారికి వేదాస్, సంగారెడ్డి జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తున్నాము.
-----------------------
ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ సార్ నేడు వర్ధంతి సందర్భంగా వారికి ఇవే జోహార్ జోహార్ కొత్తపల్లి జయశంకర్ సార్ కు జోహార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే అది మీ వల్లనే మీ కృషి పట్టుదల మీ ఆరాటం మీ పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మీరు చూడలేక పోయారు అది మా దురదృష్టం ఏదేమైనా మీరు కోరుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఈ రోజు మీకు ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ మరొకసారి మీకు మా జోహార్లు తెలియజేసుకుంటూ
- గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మను మయ సంఘం అధ్యక్షులు, రాళ్ళబండి విష్ణు ప్రధాన కార్యదర్శి, ఫులోజు అశోక్ చారి ఉపాధ్యక్షులు, కొలనూరు శ్రీనివాస్, కోశాధికారి బదనకంటి సైదాచారి మరియు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ
Comments
Post a Comment
Your Comments Please: