Skip to main content

మనోజ్ లాస్ట్ మెసేజ్


 


ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చే జర్నలిస్టు మనోజ్ ఫోన్ ఇక మోగదు. ఫోన్ మీద మెసేజ్ టైప్ చేసే వేళ్లు చలనం లేకుండా పడి ఉన్నాయి. టీవీలో ఫోన్-ఇన్ లేదా లైవ్ ఇచ్చే ఆ గొంతు శాశ్వతంగా వినపడదు. ఆ మొహం ఇక శాశ్వతంగా కనపడదు. రిపోర్టర్ గా స్క్రీన్ మీద నీట్ గా కనిపించే మనోజ్... ఆఫ్ లైన్లో ఇచ్చే మెసేజ్ లు చాలా విలువైనవి. ఇలాంటి క్రైమ్ రిపోర్టర్లు సేకరించే సమాచారమే చానల్ యాజమాన్యాలను కవరేజ్ విషయంలో ముందుంచుతుంది. ఆ వేగమే, ఆ ఎక్స్ క్లూసివ్ నెస్సే రిపోర్టర్లను ఉన్నకాడ ఉండనీయదు. ఏదో  కొత్త కబురు తేవాలి.. ఇంకేదో ఎవరికీ తెలియని విషయాన్ని తన చానల్లో, తన ద్వారా ప్రజలకు చేరవేయాలి... తానేంటో నిరూపించుకోవాలి... మేనేజ్ మెంట్ దగ్గర గుడ్ బుక్స్ లో చోటు సంపాదించుకోవాలి... బ్యూరో చీఫ్, ఇన్ పుట్ ఎడిటర్, ఎడిటర్, చైర్మన్ లకు తానిచ్చే ఇన్ పుట్స్ కీలకమని తెలియాలి. అందుకోసమే ఏ జెన్యూన్ జర్నలిస్టయినా ఎన్ని మైళ్లయినా పరుగులు తీస్తాడు. అదే చేశాడు మనోజ్. ఆ పరుగులు తీస్తున్న క్రమంలోనే కన్నుమూశాడు. మనోజ్.. జర్నలిజం వృత్తిలో భాగంగా మేనేజ్ మెంట్ కు అవసరమైన ఇతర కీలకమైన పనులే చేసేవాడని తెలుస్తోంది. అంటే మేనేజ్ మెంట్ కు చాలా దగ్గరి మనిషన్నమాట. ఉదయం 8 గంటలకు గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన మనోజ్ గురించి వాట్సాప్ జర్నలిస్టు గ్రూపుల్లో అప్పుడే బ్రేకింగ్స్ పడిపోయాయి. మిస్త్రీనియా గ్రేవీస్ అనే వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కు ఆపరేషన్ జరిగింది. ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పుడే కరోనా సోకిందంటున్నారు. వ్యాధి తిరగబెట్టడం, కరోనా సోకడం కారణంగా మనోజ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రాథమికంగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెంటిలేటర్ మీదికి ఎక్కించినా కూడా ఫలితం లేకుండా పోయింది. కాసేపటికే మరణాన్ని డాక్టర్లు డిక్లేర్ చేశారు. 



కానీ అదేం చిత్రమో... వార్తా చానల్లో పనిచేసి.. ఓ వార్తగా మారిన కూలీ మరణం మాత్రం వార్త కాకుండా పోయింది. కరోనాతో ఫలానా చోట, ఫలానా వ్యక్తి చనిపోయాడని గంభీరమైన మ్యూజిక్స్ తో బ్రేకింగ్స్ తిప్పే చానళ్లకు ఓ జర్నలిస్టు మరణం మాత్రం అసలు న్యూసే కాకుండా పోయింది. మరో విచిత్రమేమంటే ఏడాది క్రితం ఏపీ నుంచి ఓ స్టాఫర్ చనిపోతే బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ తిప్పిన చానళ్ల సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడా ప్రాంతీయమే పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తుండడం విశేషం. 


సరే.. ఇక మనోజ్ కుటుంబ విషయానికొద్దాం. 8 నెలల క్రితమే మనోజ్ కి పెళ్లయిందట. త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ సంతోషం తీరకుండానే మనోజ్ శాశ్వతంగా బిడ్డకు దూరమయ్యాడు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆనవాళ్లు తెలియకుండా పోయాయి. భార్య పరిస్థితేంటి.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల పరిస్థితేంటి.. ఇదీ ఓ జర్నలిస్టు అకాల మరణం చుట్టూ ముడివడి ఉన్న అంశాలు. 
ఇక తెలంగాణ సర్కారు కూడా జర్నలిస్టుల పట్ల చాలా వింతగా, మొండిగా వ్యవహరిస్తోందన్న అపవాదు చాలాకాలంగా ఎదుర్కొంటోంది. అది పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రెస్ మీట్లలో కూడా కనిపించింది. జర్నలిస్టుల విషయంలో తన అలక్ష్యాన్ని కేసీఆర్ ఎక్కడా దాచుకోలేదు. అయితే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా అదే శైలిని కేసీఆర్ సర్కారు అనుసరిస్తోంది. ఉపాధి దెబ్బతిని ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డ సెక్షన్ లో జర్నలిస్టులు పెద్దసంఖ్యలో ఉన్నారు. పలు చానళ్లు కూడా ఇప్పటికే తీసివేతలు పూర్తి చేశాయి. ఇటు మనోజ్ మరణవార్త సోషల్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న టైమ్ లోనే తెలంగాణలోని ఓ ప్రముఖ పత్రిక నుంచి ఓ జిల్లా ఎడిషన్ లో పనిచేస్తున్న 10 మంది సబ్ ఎడిటర్లకు ఉద్వాసన పలికినట్లు వార్తలు రావడం గమనించాల్సిన అంశం. మరోవైపు కోర్టు కేసులను వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ.. కక్షిదారుల జేబులు గుల్ల చేసే లాయర్లకు కరోనా సాయంగా రూ. 25 కోట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. జర్నలిస్టుల కోసం కనీసం ఓదార్పు మాటైనా మాట్లాడలేదని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 


మనోజ్ మరణంతో కలత చెందిన ఓ జర్నలిస్టు సోదరుడి మనోగతం ఇలా ఉంది.


ఏంది భాయ్ ఈ దారుణం.... 
జీతం సరిగా ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా....
- న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు...
- పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..
- రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు ఉన్నారని తెలుసు..
- అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు...
- అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు....
- 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు..
- మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు..
- రెగ్యులర్ గా మార్చురి దగ్గర వాసన పీల్చాలని తెలుసు...
- శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు..
- సమాచారం వస్తే 5 నుండి 10 నిమిషాల్లో స్పాట్ లో ఉండాలని తెలుసు...
- కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు..
- మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు...
- టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు...
- ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే పై నుండి పడే అక్షింతలు తెలుసు...
- హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదని తెలుసు..
- ఎవడూ సాయం చేయడని తెలుసు..
- జీతం టైయానికి ఇవ్వరని తెలుసు..
-  జీవితానికి గ్యారంటి లేదని కూడా తెలుసు..
- కరోనా కవరేజ్ ఇవ్వాలని తెలుసు..
- కరోనా వైరల్ వైరస్ అని తెలుసు..
- జాగ్రత్తలు తీసుకొనే డాక్టర్లే బలైపోతున్నారని తెలుసు..
- మిగిలిన స్టాఫ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా నువ్వు మాత్రం ఫీల్డ్ లో ఉండాలని తెలుసు..
- కోవిడ్ హాస్పటల్స్ దగ్గరకి, కంటోన్మెంట్ ఏరియాల దగ్గరకి వెళ్లాలని తెలుసు...
- కరోనా సోకే ప్రమాదం ఉందని తెలుసు...


ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నావంటే... అదీ రిపోర్టర్ అంటే...


Note: 
సాటి  మిత్రుని గా నీ మరణం నన్ను కలచివేసింది మిత్రమా....  ఈ మరణంతో అయినా మీడియా యాజమాన్యాలు & జర్నలిస్టు సంఘాలు కళ్లు తెరిచి హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పై దృష్టిపెట్టాలి.


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...