తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో స్థానిక విశ్వబ్రాహ్మణులు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వస్వాన్ని అర్పించడమే గాక, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సార్ సేవలను కొనియాడారు. ఆయన జీవితంలో తెలంగాణ సాకారాన్ని చూడకపోయినా... కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం చూసి ఆయన ఎంతో ఆనందించారని సమావేశానికి హాజరైన సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా తెలంగాణను ఇక ఎవరూ ఆపలేరని అందరితో చెప్పిన జయశంకర్ సార్.. అదే ఆత్మవిశ్వాసంతో కడదాకా ఉన్నారన్నారు.
ఆయన మాత్రమే గాక తెలంగాణ కోసం తొలిసారి బలపీఠమెక్కి.. ఉద్యమాన్నని రగిలించిన శ్రీకాంతాచారి వంటి ఎందరో విశ్వకర్మల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. అలాంటి విశ్వకర్మల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విశ్వకర్మలు ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని, అయినా అన్ని వర్గాలకు ఎంతో కొంత సాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విశ్వకర్మల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం పోరాటాలకు ముందుకొచ్చి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంబీసీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి (సీఎల్ ఆచారి), వలబోజు రవికిరణ్, కొండపర్తి వెంకటాచారి, సి. అభిషేక్, బి. సదానంద్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు కె.సి.కాళప్ప ఆదేశాల మేరకు తాము కేవలం విశ్వబ్రాహ్మల కోసమే కాకుండా యావత్ ఎంబీసీ జాతుల కోసం పోరాడుతున్నామని, ఈ క్రమంలోనే ఎంబీసీ సోదర సంఘాలన్నీ జయశంకర్ సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారని సీఎల్ ఆచారి చెప్పారు.
Comments
Post a Comment
Your Comments Please: