దేశ చరిత్ర నిర్మాతలైన విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మలకు వారి నేపథ్యంపై సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పని చేస్తోందని, ఈ క్రమంలో ఆ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని వీకేసీ జాతీయ కార్యదర్శి జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో ఆ సంస్థ కమిటీలు వేస్తున్నామని ఆచార్య జైన్ తో పాటు వీకేసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల వేణుఆచార్య చెప్పారు. తాము ఎంపిక చేసిన నాయకులకు నియామక పత్రాలు అందజేశామని వారన్నారు.
వీకేసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసోజు నాగభూషణం, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్లుగా సింగోజు శశిధర్, మామిడాల వెంకీ ఆచార్య, గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా చెలకుర్తి విష్ణు, గ్రేటర్ హైదరాబాద్ గోషామహల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు ప్రదీప్ కుమార్ తదితరులను నియమించినట్లుగా వారు చెప్పారు.
ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న బాధ్యులు భాగ్యనగర్ పోస్టుతో మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధికి, విశ్వకర్మీయుల్లో చైతన్యానికి తమవంతుగా కృషి చేస్తామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించిన జైన్ కుమార్ ఆచార్య, రాష్ట్ర అధ్యక్షులు వేణు ఆచారికి వారు కృతజ్ఞతలు చెప్పారు.
దాసోజు నాగభూషణం
శశిధర్
సి.హెచ్. విష్ణు
సి.హెచ్. ప్రదీప్ కుమార్
ఎం.వెంకీ
Comments
Post a Comment
Your Comments Please: