కోవిడ్-19 వైరస్ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి పోరాడిన యోధులను ప్రోత్సహించేందుకు ప్రణవి ఫౌండేషన్ ముందుకొచ్చింది. అన్నార్తుల ఆకలిబాధలు తీర్చినవారైనా, నగదు సాయం చేసి ఆదుకున్నవారైనా, స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించినవారైనా.. ఇలా ముందువరుసలో ఉండి తమదైన కర్తవ్యం స్వచ్ఛందంగా నిర్వహించినవారిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నట్టు ప్రణవి ఫౌండేషన్ అధ్యక్షులు జైన్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ప్రజాసేవలో స్వచ్ఛందంగా పనిచేసిన ఎవరైనా తాము పనిచేసినట్టు రుజువుగా చూపే ఒక ఫొటోతో పాటు వారి పాస్ పోర్టు సైజు ఫొటోను కూడా తమకు మెయిల్ చేయాలని కోరారు. అదే మెయిల్ ఐడీకి ప్రశంసాపత్రాన్ని పంపిస్తామన్నారు. మెయిల్ ఐడీ- pranavifoundation@gmail.com గా చెప్పారు.
ఇదే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆరకంటి కృష్ణయ్యకు జైన్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కుటుంబాన్ని, వ్యక్తిగత పరిమితులను లెక్కలోకి తీసుుకోకుండా కరోనాకు వ్యతిరేకంగా పోరాడారని జైన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: