Skip to main content

వీరగురుడికి విశ్వబ్రాహ్మల గురుపూజ


తెలుగునాట గురుపూజా ఉత్సవం ఘనంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు తమ నేపథ్యాన్ని అనుసరించి గురుపరంపరను స్మరించుకున్నారు. ఇక ఆధ్యాత్మికంగా తమదైన విలక్షణతకు ప్రఖ్యాతి గల విశ్వబ్రాహ్మలు.. విశ్వసృష్టిని రచించిన విశ్వకర్మ, ఆదిశంకరాచార్యుడు, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వాములను స్మరించుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా అన్ని చోట్లా వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించి గురుపూజ నిర్వహించారు. 

 

శేరిలింగంపల్లిలో మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు ఆచార్య మాణిక్యం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆచార్య మాణిక్యం విశ్వబ్రహ్మ జాతి తనదైన మూలాలు తెలుసుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని కోరారు. విశ్వబ్రాహ్మలు కేవలం ఆధ్యాత్మిక పథంతో పాటుగా వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవాలన్నారు. విశ్వ గమనానికి, గమ్యానికి అవసరమైన అన్నీ ఎంతో జాగ్రత్తగా రచించి ఇచ్చిన విశ్వబ్రాహ్మలు ఇవాళ ఆకలితో అలమటించే పరిస్థితుల మీద పోరాడాలని, ఇందుకోసం కదిలివచ్చే నాయకత్వాన్ని సమర్థించాలని విజ్ఞప్తి చేశారు. 




విశ్వబ్రాహ్మలు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ లేదని, ఒకసారి అందరూ ఆ దిశగా సంకల్పం తీసుకుంటే సర్వకార్యాలు కూడా పాదాక్రాంతం అవుతాయని, పాలకులను కూడా శాసించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణ సాధనలో జీవితాలనే త్యాగం చేసిన ఆచార్య జయశంకర్, శ్రీకాంతాచారిని గుర్తు చేసుకొని తమకు రావాల్సిన రాజకీయ వాటా కోసం అలుపులేని పోరు సాగించాలని పిలుపునిచ్చారు. 

---------------------------


 

సికింద్రాబాద్ విశ్వకర్మ భవన్ లో వీరబ్రహ్మేంద్రస్వామి గురుపూజా ఉత్సవాన్ని ఆ సంఘం అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 

 


-------------------------------------------

 


 

అలాగే హైదరాబాద్ అంబర్ పేటలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి, వేదాస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు A. జైన్ కుమార్ ఆచార్య, శ్రీ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
 

----------------------------



గురుపూజానంతరం దైవారాధనలో చేపూరి లక్ష్మణాచారి దంపతులు, ఉప్పుగూడ, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.