ఆపదల్లో అప్రమత్తం చేసి, ప్రమాదాల నుంచి తప్పించి, విధుల్లో విజయాలు అందించి, మెడల్లో మెడల్స్ వేయించి.. అడుగడుగునా గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసిన ఆ పోలీసుల సహచరి వారి నుంచి శాశ్వతంగా దూరమైంది. చేతుల్లోనే పెరిగి, పెట్టింది తిని, అప్పజెప్పిన టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసిన లియో అనే స్నిఫ్ఫర్ డాగ్ అకాలంగా చనిపోవడంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా ఏర్పడినప్పుడే జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా కార్యాలయానికి నూతన సిబ్బందితో పాటు లియో అనే పోలీస్ జాగిలం కూడా పోలీసులతో పాటే అడుగు పెట్టింది. లియో పేరు చెపితే నిందితులకు, సంఘ విద్రోహులకు ముచ్చెమటలే. ఆ జాగిలం ప్రత్యేకతే వేరు. పోలీసులు ఛేదించలేని నేరాలు సైతం ఈ పోలీసు జాగిలం కనిపెడుతుందని గొప్పగా చెబుతున్నారు. లియో జిల్లాకు వచ్చిన్నటి నుంచి తన విధి నిర్వహణలో భాగంగా మేడారంలో ఏర్పాట్లు, సీఎం భద్రతా పర్యవేక్షణ విధులు, నేరస్తులను పట్టకోవడం... ఇలా తన పాత్ర భేషంటున్నారు పోలీసు అధికారులు. ఆర్మ్డ్ రిజర్వ్ లో పోలీసు ఉన్నతాధికారి అయిన డీఎస్పీ జనార్దన్ రెడ్డి... లియో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిందని, తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సేవలందించిన లియో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదని... దాని సేవలు గుర్తు చేసుకుని విలపించారు. శనివారం రాత్రి లియో కాలం చేయడంతో పోలీసు లాంఛనాల మధ్య జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: