హైదరాబాద్, కూకట్ పల్లిలోని మూసాపేటకు చెందిన మంచినీళ్ల ట్యాంకర్ ఇది. ప్రజలకు మం..చి..నీ..ళ్లు సరఫరా చేయాల్సిన ఈ మున్సిపల్ ఉద్యోగి ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో చూడండి. ఇలాంటివాళ్లను ఏం చేస్తే బాగుంటదో మీరే చెప్పండి. ప్రజలకు మంచినీళ్లు ఇచ్చేందుకు వాటర్ ట్యాంకర్ లో వాటర్ లోడింగ్ చేస్తుండగా.. అదే ట్యాంకర్ లో ఏకంగా కాళ్లను కడుగుతున్నాడు. వందలాది మంది ఇదే నీటిని తాగి ప్రాణాలు నిలుపుకుంటున్న తరుణంలో.. తాను, తన కుటుంబం తాగడం లేదు కదా.. ఎవడెలా పోతే నాకేంటి.. అనే ఇలాంటి దుష్టబుద్ధులను దేవుడు కాదు.. అధికారులే శిక్షించాలి.
Comments
Post a Comment
Your Comments Please: