Skip to main content

Posts

Showing posts from November, 2020

గ్రేటర్ పోల్: ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్

డిసెంబర్ 1న జ‌రిగే జీహెచ్ఎంసీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260:  పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896, ఇతరులు 676 మొత్తం వార్డుల సంఖ్య 150 పోటీ చేసే అభ్యర్థులు 1122:      టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149,  కాంగ్రెస్ 146,  టి.డి.పి 106,  ఎం.ఐ.ఎం 51,  సి.పి.ఐ 17,  సి.పి.ఎం 12,  రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76,  స్వతంత్రులు 415 ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య  60,  స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్ ల సంఖ్య 30 పోలింగ్ సిబ్బంది 48,000 రిటర్నింగ్ అధికారులు 150 సహాయ రిటర్నింగ్ అధికారులు 150 సాధారణ పరిశీలకులు 14 వ్యయ పరిశీలకులు 34 మైక్రో అబ్జర్వర్ లు 1729, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277 మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683 పోస్టల్ బ్యాలెట్లకై అందిన దరఖాస్తులు 2831 డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి. ఉ. 6 నుండి 6:15 మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉ. 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయ‌డం జ...

వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజు 20 వేల టిక్కెట్లను జారీ చేస్తామని చెప్పారు. Readable:   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సర్వేలు ఏం చెబుతున్నాయి?                          హైదరాబాద్ లో రోహింగ్యాలు.. కన్ఫామ్

గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

గ్రేటర్ ఎన్నికలు జాతీయ అంశంగా మారడంతో అందరి దృష్టీ హైదరాబాద్ మీదనే పడింది. ఎవరు గెలుస్తారు.. ఎవరు గ్రేటర్ పీఠాన్ని ఏలుతారు.. అనేది అందరి మదనీ తొలుస్తున్న అంశం. అందరికన్నా ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడైన ఎంఐఎం కు మరింత అవసరమైన సబ్జెక్టు. దీని మీద గ్రౌండ్ సర్వేలు కూడా పలు ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. నవంబర్ మొదటి నుంచి ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పనిచేసి రిపోర్టులను రికార్డు చేస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు, వేడి పుట్టించే కామెంట్లు వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ... ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సంస్థల రిపోర్టులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.  Also Read:  రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?                          ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా? ఈ వీడియోలో ఇంకా పూర్తి వివరాలు, విశ్లేషణ ఉన్నాయి. చూడండి.  

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు...

మాదిగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‍లో ఒత్తిడి తేవాలి

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు.  జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని...

గద్గద స్వరంతో మాట్లాడిన గౌడ్‍సాబ్: ఏమన్నాడంటే..

తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ ను తెలంగాణ పౌరులకు, ముఖ్యంగా ఉద్యమంతో ఏ కాస్త సంబంధం ఉన్నవారికైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన స్వామిగౌడ్... తాజాగా ప్రెస్ మీట్ లో మనసువిప్పి మాట్లాడారు. పార్టీలో తనకు జరిగిన అవమానం నుంచి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్.. ఎంఐఎంతో రాజీపడిపోయి వ్యవహరిస్తుండడం వరకు అనేక అంశాలను మీడియాతో ఖుల్లంఖుల్లా పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన గొంతు తడబడటం గమనించాల్సిన అంశం. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినట్లయిందని.. తాను చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అంశాన్ని గుర్తు చేసుకోవడం విశేషం.  స్వామిగౌడ్ లేవనెత్తిన అంశాలు: 1) తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి పాటపాడిన కళాకారులు ఎక్కడ? 2) వలస పాలకుల దమననీతికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పనిచేసిన పాత్రికేయుల జాడెక్కడ? 3) తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని కష్టనష్టాలకోర్చిన ఉద్యమకారులు ఇప్పుడెక్కడ ఉన్నారు? 4) ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తిని తీర్చిండి. వారిని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు? 5) నా నియోజకవర్గ...

అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు

రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి  సీఎం జగన్ తో పాటు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అవార్డులు, సన్మానాలు

కరోనా ఆపత్కాలంలో భయంకరమైన వైరస్ కి భయపడకుండా పేదలు, అన్నార్తుల ఆకలి కేకలు విని స్పందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మోర్డ్ స్వచ్ఛంద సంస్థ  ఘనంగా సత్కరించింది. వారు చేసిన సేవలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతో హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని ఆడిటోరియంలో అర్హులైనవారికి గోల్డెన్ లీడర్స్ ఎక్సలెన్సీ అవార్డ్స్ అందజేశారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి హాజరయ్యారు. సమాజ సేవలో ముందుండి పోరాడిన యోధులను సన్మానించుకోవడం మంచిదన్నారు. దీనివల్ల ఇలాంటి సేవాతత్పరులు ఇంకా ముందుకొచ్చి మేలైన సమాజానికి తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాగురు రాందేవ్ బాబా శిష్యుడైన రామకృష్ణదేవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రముఖ నటుడు, సోషల్ వర్కర్ టార్జాన్ లక్ష్మినారాయణ, నిర్మాత, దర్శకుడు రామసత్యనారాయణ, నటుడు మాణిక్ రావు, డాక్టర్ ఎ.శ్రీనివాస్, డాక్టర్ ప్రశ...

లాండ్రీ, దోభీఘాట్లకు ఫ్రీ పవర్.. అంతకుమించి అడగొద్దు

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. లాండ్రీలకు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించారు.  మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: - ఎన్నికల ప్రణాళికలనేవి కేవలం కాగితాలకే పరిమితమైపోతున్న నేటి రాజకీయాల్లో 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తాను ప్రకటించిన పార్టీ ప్రణాళిక (మేనిఫెస్టోను వందకు వంద శాతం అమలు చేసిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాదు... చెప్పని అంశాలను కూడా అనేకం ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి రాజకీయాల్లో ఇదో అరుదైన అంశం. మాకు తెలంగాణ ప్రజల పట్ల, హైదరాబాద్ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం. మేం చెప్పనవి, అమలు చేసిన పలు కార్యక్రమాలు. • నగర ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. దీనిపై మేం మేనిఫెస్టోలో చెప్పలేదు. చెప్పకపోయినా అమలు చేశాం. నగరంలో 350 ...

ఆ లోగుట్టు ఒవైసీకే ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు. మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావస...

బీజాపూర్ జిల్లాలో పేలిన ప్రెషర్ బాంబు

బీజాపూర్ జిల్లాలో ప్రెషర్ బాంబు పేలి 209 బెటాలియన్ జవాన్ నిర్మల్ కుమార్ సాహు కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం కింద రహదారి పై మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఒక చోట రెండు కేజీల ఐఈడి మందుపాతరను పెట్టగా బీడీఎస్ బృందాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. అదే క్రమంలో మరో చోట పెట్టిన ప్రెషర్ బాంబు పేలుడు కు జవాన్ గాయపడ్డారు.

నగ్రోటా చొరబాటు: 26/11 మోడల్ ఆపరేషన్ కోసమేనా?

   జమ్మూ జిల్లా నగ్రోటా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు టెర్రరిస్టులు భారీ కుట్రతోనే దేశంలోకి చొరబడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఇవే అంశాలు వెలుగుచూశాయి. హోంమంత్రి అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ఎజిత్ దోవల్, ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లాతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నగ్రోటా ఎన్ కౌంటర్ పై సమీక్షించారు. 2008 నవంబర్ 26న ముంబై మీద జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలోనే తాజాగా కాశ్మీర్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతా దళాలు అంచనా వేశాయి. మరో వారం రోజుల్లో ఆనాటి భారీ అటాక్ జరిగిన దినం సమీపిస్తున్న దృష్ట్యా ఉగ్రవాదులు ట్రక్ లో దాక్కొని మళ్లీ అలాంటి భయానకమైన దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన విషయంపై చర్చించారు.  గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమవడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పీఓకే లోని టెర్రరిస్టు స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం గమనించాల్సిన అంశం. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా భీకరమైన దాడులకు పాల్ప...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు మోక్షం ఎప్పుడు?

- కేటీఆర్‍కు టీయూడబ్ల్యూజే వినతిపత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం మరోసారి తెరమీదికొచ్చింది. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు మోక్షం లభించేది ఎప్పుడని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటిషన్లు దాఖలైన సందర్భాల్లో వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం... జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం కోర్టు సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. మంత్రి కె.తారకరామారావుతో  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన "మీట్-ది-ప్రెస్" కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోవడం విచారకరమన్నారు. మూడేళ్ళుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతుండడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మరెందరో అప్పులు చేసి చికిత్స పొందినట్లు విరాహత్...

అనతికాలంలోనే రూ. 2600 కోట్ల టర్నోవర్

హైదరాబాద్ సరూర్ నగర్ సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ టర్నోవర్ రూ. 2600 కోట్లు దాటిందని ఆ సొసైటీ ఎమ్మెస్సార్వీ ప్రసాద్ తెలిపారు. 23 ఏళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటూ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ ఉందని, వారి విశ్వాసంతో తమ సంస్థ ఇంకా ఎదుగుతుందని ఆకాంక్షించారు. 23 వ సర్వసభ్య సమావేశం కూకట్ పల్లిలోని ఎన్.ఆర్.సీ గార్డెన్ లో జరిగిన సందర్భంగా కస్టమర్ల మన్నన చూరగొనడం తమ అదృష్టమన్నారు ప్రసాద్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. M.S.R.V ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ జె.సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.    

బాణాల సమర్పణలో మరో ఐదు ఆధ్యాత్మిక పరిమళాలు

ప్రాచీన వేద విజ్ఞానాన్ని, మన మహర్షులు అందించిన అద్భుతమైన సాహితీ వారసత్వాన్ని ప్రజలందరికీ అందించేందుకు బాణాల మల్లికార్జునరావు ఎన్నో ఏళ్లుగా  పాటుపడుతున్నారు. ఇందుకోసం ఆయన సనాతన సాహితీ పరిషత్ అనే సంస్థను స్థాపించి సాహితీ సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో అయిదు మేలైన పుస్తకాలను ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శతక సంపుటి, నూతలపాటి వెంకటరత్న శర్మ రచించిన సూర్యచరితము-పద్యకావ్యం, తెనాలి రామలింగ కవి రచించిన ధీరజన మనోవిరాజితముతో పాటు సంధ్యావందన్ చేసుకోవాలనేవారి కోసం లఘు సంధ్యావందనమ్, కర్మకాండ నిర్వహణలు వివరించే ఆబ్దికారాధనమ్ అనే గ్రంథాలను సనాతన సాహితీ పరిషత్ ద్వారా ప్రచురించారు.  ఈ ఐదు పుస్తకాలను ఆవిష్కరించి ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెదపాటి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ సమాజానికి ప్రకృతికి, దేహానికి మధ్య ఉండే అనేక మార్మిక రహస్యాలను విప్పి చెప్పారని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ఎవరూ అనర్హులు కారని, సాధన ద్వారా ఎవ్వరైనా అలౌకిక ఆనందాన్ని, యోగ ...

ఓసీ, బీసీ, ఎస్సీ: ఒక బ్యాలెన్సింగ్ ఫార్ములా

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. శనివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. బస్వరాజు సారయ్య: ఉమ్మడి వరంగల్ జిల్లాకు బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లోకి చాలా కాలం క్రితమే వచ్చినా.. ఎప్పుడూ, ఎక్కడా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేదు. ఏ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సారయ్య.. తన పోర్ట్ ఫోలియోకు తగిన స్థానం లభించకపోవడంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధినేత కేసీఆర్ సారయ్య పేరును బీసీ కోటాలో ఫైనల్ చేశారు. బీసీలకు 50 శాతం కోటా డిమాండ్ బలంగా వినిపిస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా నుంచి బీసీల్లో అట్టడుగు వర్గానికి ...

తలసాని ఇలాకాలో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్

దేశంలోనే తెలంగాణను అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ని చేస్తున్నారని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింట‌న్ కోర్టులు, లేడీస్ జిమ్‌, యోగా హాల్‌, స్నూక‌ర్ రూమ్‌, క్యార‌మ్స్, జెంట్స్ జిమ్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు స‌దుపాయాలు క‌ల్పించారు. సనత్ నగర్ నెహ్రూ పార్కులో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంత‌కుముందు బ‌ల్కంపేట‌లో రూ. 3.60 కోట్ల‌తో నిర్మించిన వైకుంఠ‌ధామాన్ని ప్రారంభించారు.  స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు తెలుసుకుని వాటిని తీర్చేవారే అస‌లైన నాయ‌కులని కేటీఆర్ అన్నారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రాష్ర్టం ఏర్ప‌డ్డ స‌మ‌యంలో అనేక అనుమానాలు ఉండేవి. అప్పుడు క‌రెంట్ ఉంటే వార్త‌.. నాడు న...

దుబ్బాకలో కారు ఖరారు: ఆరా సర్వే

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ పోల్ సర్వే ఏజెన్సీ ఆరా తాజాగా పోల్ రిజల్ట్స్ విడుదల చేసింది.  ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ 48.72 శాతం ఓట్లతో ముందంజలో ఉందని, ఆ తరువాత 44.64 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని తేల్చింది. ఇక కాంగ్రెస్ మాత్రం చాలా దారుణంగా 6.12 శాతం ఓట్లు మాత్రమే రాబట్టి మూడో స్థానానికి పరిమితమైందని అంచనా వేసింది. 2.52 శాతం ఓట్లను ఇతరులు రాబట్టుకుంటారని ఆరా అంచనా వేసింది.  ఈ నెల 10వ తేదీన దుబ్బాక బైపోల్ ఫలితాలు విడుదలవుతాయి. దీనికోసం టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

తిరుమలలో బుస్ బుస్ నాగన్న

తిరుమలలో పాము హల్ చల్ చేసింది. వి.ఐ.పి బస చేసే సన్నిధానం అతిధి గృహం వద్ద ప్రత్యక్షమైన నాగుపామును చూసి భక్తులు, ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు..అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సన్నిధానం అతిధి గృహం వద్దకు చేరుకుని చాకచక్యంగా పామును పట్టి అవ్వాచారి కోన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు.

అర్నాబ్‌ అరెస్టు: వరంగల్ జర్నలిస్టుల ధర్నా

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉదయమే దాదాపు 20 మంది పోలీసులు అర్నాబ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా అరెస్టు చేశారు. వారెంటుగానీ, నోటీసులు గానీ ఏమీ లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అర్నాబ్ పై పోలీసులు దాడి కూడా చేశారు. ఆయన కుమారుడి పైనా దాడికి దిగారు. ఆ తరువాత రాయ్‌గడ్ కు తరలించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు.  ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను  అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారు. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆ టీవీ పేర్కొంది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్  సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది....