Skip to main content

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్నారని, వారిలో 4561 మందికి వేలుముద్రలు, ఐరిస్ సేకరించామని, ఎన్నికల తరువాత 274 మంది వివరాలు సేకరిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ వోటర్ ఐడీస్, కొందరైతే బ్యాంక్ అకౌంట్లు కూడా కలిగి ఉన్నారని స్వయంగా ప్రకటించారు. 

ఈ మధ్య ఏం జరిగిందో ఎవరైనా ఊహించుకోవచ్చు. గత ఫిబ్రవరిలో తాము రోహింగ్యాలను గానీ, అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ పౌరుల్ని, బంగ్లాదేశీయులను గానీ.. ఎవరినీ ఇక్కణ్నుంచి పంపించే ప్రశ్నే లేదని.. వారికి అన్ని సౌకర్యాలూ దగ్గరుండి చూసుకుంటామని, కేసీఆర్ రోహింగ్యాలను ఆదరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ చెప్పడం అప్పట్లో తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు అవసరమైతే తెలంగాణ మంత్రి, ఒవైసీతో కలిసి రోహింగ్యాలకు భరోసా ఇచ్చేందుకు సభ నిర్వహిస్తామని గాంధీ బాహాటంగా ప్రకటించారు. 

అయితే నేషనల్ లెవల్ ఇష్యూ అయిన అక్రమ రోహింగ్యాలను దేశం కళ్లుకప్పి హైదరాబాద్ లో దాచిపెడతామన్న ధీమాతో ఉన్న కేసీఆర్ కాస్తా... ఇప్పుడు ఎన్నికల్లో సీన్ టిపికల్ గా మారుతుండడంతో తమ ప్రభుత్వం నిమిత్తమాత్రంగా ఉందని, చాలా క్లీన్ గా ఉన్నామని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడడం వల్లే సీపీ రంగంలోకి దిగి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. మరోవైపు 2 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే హుంకరించడం, వారితో పొత్తు లేదని కేటీఆర్ సన్నాయినొక్కులు నొక్కడం, దానికి అక్బరుద్దీన్ కూడా అదే లెవల్లో ఘాటుగా రియాక్టు కావడం.... ఈ సర్కస్ ఫీట్లు చూస్తుంటే.... రోహింగ్యాలతో తమకు ప్రమేయం లేదని చెప్పేందుకే కొత్త స్కెచ్ వేశారా అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ జరిగిన నష్టం ఎంతనేది ఈనెల 4న చూడాల్సిందే. 

Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

Read: కేసీఆర్ ఎదుర్కోబోయే ప్రమాదాన్ని ముందే చెప్పిన... 

Note: రాచకొండ సీపీ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు




Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.