Skip to main content

30 సర్కిళ్లు.. 30 కౌంటింగ్ సెంటర్లు.. సీసీ టీవీ కెమెరాలు

గ్రేటర్ హైదరాబాద్ ను మొత్తం 30 సర్కిళ్లుగా విభజించి అందులో డివిజన్లు/వార్డులవారీ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో సర్కిల్లో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ కి 14 టేబుల్స్, ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 30 సర్కిళ్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఉన్న సర్కిల్స్, డివిజన్ల వివరాలు ఇవీ.. 


1) కాప్రా సర్కిల్ : 1) కాప్రా 2) ఏఎస్ రావు నగర్ 3) చెర్లపల్లి 4) మీర్‍పేట్ హెచ్బీ కాలనీ 5) మల్లాపూర్ 6) నాచారం

2) ఉప్పల్ సర్కిల్ : 7) చిలుకనగర్ 8) హబ్సిగూడ 9) రామంతాపూర్ 10) ఉప్పల్

3) హయత్‍నగర్ సర్కిల్: 11) నాగోల్ 12) మన్సూరాబాద్ 13) హయత్‍నగర్ 14) బీఎన్ రెడ్డినగర్

4) ఎల్బీనగర్ సర్కిల్: 15) వనస్థలిపురం 16) హస్తినాపురం 17) చంపాపేట్ 18) లింగోజిగూడ

5) సరూర్‍నగర్ సర్కిల్: 19) సరూర్‍నగర్ 20) ఆర్కేపురం 21) కొత్తపేట 22) చైతన్యపురి 23) గడ్డిఅన్నారం

6) మలక్‍పేట్ సర్కిల్: 24) సైదాబాద్ 25) మూసారంబాగ్ 26) ఓల్డ్ మలక్‍పేట్ 27) అక్బర్‍బాగ్ 28) అజాంపురా 29) చావని 30) డబీర్‍పురా

7) సంతోష్‍నగర్ సర్కిల్: 31) రెయిన్‍బజార్ 34) తలాబ్ చంచలం 35) గౌలిపురా 37) కుర్మగూడ 38) ఐఎస్‍సదన్ 39) సంతోష్‍నగర్

8) చాంద్రాయణగుట్ట సర్కిల్: 36) లలితాబాగ్ 40) రియాసత్‍నగర్ 41) కంచన్‍బాగ్ 42) బార్కస్ 43) చాంద్రాయణగుట్ట 44) ఉప్పుగూడ 45) జంగంమెట్

9) చార్మినార్ సర్కిల్: 32) పత్థర్ ఘట్టి 33) మొగల్‍పురా 48) శాలిబండ 49) ఘాన్సీబజార్ 52) పురానాపూల్

10) ఫలక్‍నుమా సర్కిల్: 46) ఫలక్‍నుమా 47) నవాబ్‍సాహెబ్ కుంట 53) దూద్‍బౌలి 54) జహానుమా 55) రాంనస్తూరాపురా 56) కిషన్‍బాగ్ 

11) రాజేంద్రనగర్ సర్కిల్: 57) సులేమాన్‍నగర్ 58) శాస్త్రీపురం 59) మైలార్‍దేవుపల్లి 60) రాజేంద్రనగర్ 61) అత్తాపూర్ 

12) మెహదీపట్నం సర్కిల్: 70) మెహదీపట్నం 71) గుడిమల్కాపూర్ 72) ఆసిఫ్‍నగర్ 73) విజయనగర్ కాలనీ 74) అహ్మద్‍నగర్ 75) రెడ్‍హిల్స్ 76) మల్లేపల్లి

13) కార్వాన్‍సర్కిల్: 62) జియాగూడ 65) కార్వాన్ 66) లంగర్‍హౌజ్ 67) గోల్కొండ 68) టోలిచౌకి 69) నానల్‍నగర్ 

14) గోషామహల్ సర్కిల్: 50) బేగంబజార్ 51) గోషామహల్ 63) మంగళ్‍హాట్ 64) దత్తాత్రేయనగర్ 77) జాంబాగ్ 78) గన్‍ఫౌండ్రి 

15) ముషీరాబాద్ సర్కిల్: 85) అడిక్‍మెట్ 86) ముషీరాబాద్ 87) రాంనగర్ 88) భోలక్‍పూర్ 89) గాంధీనగర్ 90) కవాడిగూడ

16) అంబర్‍పేట సర్కిల్: 79) హిమాయత్‍నగర్ 80) కాచిగూడ 81) నల్లకుంట 82) గోల్నాక 83) అంబర్‍పేట్ 84) బాగ్అంబర్‍పేట్ 

17) ఖైరతాబాద్ సర్కిల్: 91) ఖైరతాబాద్ 97) సోమాజిగూడ 98) అమీర్‍పేట్ 100) సనత్‍నగర్

18) జూబ్లీహిల్స్ సర్కిల్: 92) వెంకటేశ్వరకాలనీ 93) బంజారాహిల్స్ 94) షేక్‍పేట్ 95) జూబ్లీహిల్స్

19) యూసుఫ్‍గూడ సర్కిల్: 96) యూసుఫ్‍గూడ 99) వెంగళరావునగర్ 101) ఎర్రగడ్డ 102) రహమత్‍నగర్ 103) బోరబండ

20) శేర్‍లింగంపల్లి సర్కిల్: 104) కొండాపూర్ 105) గచ్చిబౌలి 106) శేర్‍లింగంపల్లి

21) చందానగర్ సర్కిల్: 107) మాదాపూర్ 108) మియాపూర్ 109) హఫీజ్‍పేట్ 110) చందానగర్ 

22) రామచంద్రాపురం అండ్ పఠాన్ చెరు సర్కిల్: 111) భారతీనగర్ 112) ఆర్సీపురం 113) పఠాన్‍చెరు 

23) మూసాపేట సర్కిల్: 114) కేపీహెచ్బీ కాలనీ 115) బాలాజీనగర్ 116) అల్లాపూర్ 117) మూసాపేట్ 118) ఫతేనగర్

24) కూకట్ పల్లి సర్కిల్: 119) ఓల్డ్ బోయినపల్లి 120) బాలానగర్ 121) కూకట్‍పల్లి 122) వివేకానందనగర్ కాలనీ 123) హైదర్‍నగర్ 124) ఆల్విన్‍కాలనీ

25) కుత్బుల్లాపూర్ సర్కిల్: 127) రంగారెడ్డి నగర్ 130) సుభాష్‍నగర్ 131) కుత్బుల్లాపూర్ 132) జీడిమెట్ల 

26) గాజులరామారం సర్కిల్: 125) గాజులరామారం 126) జగద్గిరిగుట్ట 128) చింతల్ 129) సూరారం

27) ఆల్వాల్ సర్కిల్: 133) మచ్చబొల్లారం 134) ఆల్వాల్ 135) వెంకటాపురం 

28) మల్కాజ్‍గిరి సర్కిల్: 136) నేరెడ్‍మెట్ 137) వినాయకనగర్ 138) మౌలాలి 139) ఈస్ట్ఆనంద్‍బాగ్ 140) మల్కాజ్‍గిరి 141) గౌతమ్‍నగర్

29) సికింద్రాబాద్ సర్కిల్: 142) అడ్డగుట్ట 143) తార్నాక 144) మెట్టుగూడ 145) సీతాఫల్‍మండి 146) బౌద్ధనగర్ 

30) బేగంపేట్ సర్కిల్: 147) బన్సీలాల్ పేట్ 148) రాంగోపాల్ పేట్ 149) బేగంపేట్ 150) మోండామార్కెట్


- మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152

- 31 మంది కౌంటింగ్ పరిశీలకులు

- కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు

- 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.