Main Story: జానారెడ్డికి గవర్నర్‍గిరీ?
Also Read: పాక్ మెడలు వంచిన రోజు ఇదే
Also Read: ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా?
Weekend story: హండ్రెడ్ పర్సెంట్ హరామ్
Weekend Story: ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు
ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.
వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశారు. కాగితాన్ని తయారు చేయడమే కాదు.. ఆ కాగితంతో పుస్తకాన్ని కూడా అచ్చేశారు. అది కూడా గో ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఓ గ్రంథాన్నే అచ్చేయడం విశేషం. దీంతో ఆవు పేడతో తయారైన మొదటి పుస్తకం ఇదే అయ్యింది. మొన్న దీపావళి, ఆ తరువాత కార్తీక పూర్ణిమ కోసం భారీ ఎత్తున దీపాలు తయారు చేశారు. ఆవుపేడతో తయారైన ఈ దీపాలు పర్యావరణానికి మహోపకారం చేస్తాయని.. ఆ దీపాలు వెలిగించడం ద్వారా యజ్ఞం చేసిన ఫలితమే చేకూరుతుందని వారంటున్నారు. ఆ దీపాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ వచ్చిందని, తాము డిమాండ్ కు తగినట్టు ప్రోడక్ట్ కూడా సరిగా అందించలేకపోయామని అమిత్ భట్నాగర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఆవుపేడతో చెప్పులు తయారు చేస్తున్నారు. ఇది ప్రయోగ దశ దాటి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అవుతోందని.. గో ప్రేమికులు తమ ఉత్పాదనలను ఆశీర్వదించి, గోమాత కృపకు పాత్రులు కావాలని భట్నాగర్ విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఆవుపేడతో దీపాలు, పేపర్, చెప్పులు కూడా తయారవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఏం తయారవుతాయో చూడాల్సిందే.
Comments
Post a Comment
Your Comments Please: