Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ
Weekend Story: కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి
Weekend story: హండ్రెడ్ పర్సెంట్ హరామ్
Weekend Story: ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు
ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది.
అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాతంతో 2,20,504 ఓట్లు పొంది 2 సీట్లు మాత్రమే గెలవగా... టీడీపీ 1.65 శాతంతో 55,287 ఓట్లు పొంది ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే... టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లతో పోలిస్తే ఎంఐఎంకి ఎలా ఎక్కువ ఫలితాలు వచ్చాయి? మొత్తం ఓట్లలో 35.73 శాతం, 35.55 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్, బీజేపీలకన్నా చాలా తక్కువ ఓట్లు... అంటే 18.91 శాతం మాత్రమే వచ్చిన ఎంఐఎంకు ఈ స్థాయిలో సీట్లు ఎలా సాధ్యమయ్యాయి?
టీఆర్ఎస్: 35.73 శాతం (11,92,162 ఓట్లు) 56 సీట్లు
బీజేపీ: 35.55 శాతం (11,86,096 ఓట్లు) 48 సీట్లు
తేడా: 0.18 శాతం మాత్రమే
ఎంఐఎం: 18.91 శాతం (6,30,867 ఓట్లు) 44 సీట్లు
ఎంఐఎం గెలిచిన డివిజన్లు అన్నీ ఆ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న పాతబస్తీ పరిధిలోనివేనని గమనించాలి. ఈ ప్రాంతంలో తక్కువ ఓటర్ల సంఖ్యతో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు చేయడమే అందుక్కారణమని గమనించాలంటున్నారు ఎన్నికల నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ, డివిజన్లు తక్కువ.. ఈ వ్యత్యాసం జీహెచ్ఎంసీ డివిజన్లకే పరిమితం కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్ పార్లమెంట్ సీటు విషయంలో కూడా కనిపిస్తుంది. దశాబ్దంన్నర క్రితం డివిజన్లు, నియోజవర్గాల పునర్విభజన, సరిహద్దులను కుట్రపూరితంగా ఏర్పాటు చేశారని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు 5 లోపు ఉండే మజ్లిస్ అసెంబ్లీ సీట్లు 7 కి పెరిగాయి. జీహెచ్ఎంసీలో కూడా ఆ పార్టీ... జనాభా నిష్పత్తికన్నా ఎక్కువ సీట్లు పొందడం సాధ్యమవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ లో ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన దాఖలాలు కనిపిస్తాయి. గతంలో కాంగ్రెస్ అనుసరించిన పంథానే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఎన్టీఆర్ హయంలో టీడీపీ కూడా ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకుంది. కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా నిష్పాక్షికంగా డివిజన్లు, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇలాంటి అనారోగ్యకరమైన హెచ్చుతగ్గులకు బ్రేకు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి అన్ని పార్టీలూ ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.
Comments
Post a Comment
Your Comments Please: