Weekend Story: ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు
IMP Story: ఎంఐఎంతో పొత్తు కోసం తహతహ ఇందుకేనా?
మానవ జిహ్వ చాపల్యానికి వీకెండ్స్ లో ఎన్ని మూగజీవాలు క్యూ కట్టి బలవుతున్నాయో ఊహించజాలం. అయితే మానవులు జిహ్వచాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు రానే వచ్చింది. దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ప్రయోగాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. మార్కెట్ లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో కోళ్లన్నీ ఆనందించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 19) సింగపూర్లో కృత్రిమ చికెన్ "రెస్టారెంట్ 1880" లోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారుచేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్లలో ఇవాళ్టి డిన్నర్ నుంచే ఘుమఘుమలాడుతుంది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రాళ్లే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈట్ జస్ట్ కంపెనీయే సింగపూర్ లో దాని ఉత్పత్తిని తొలిసారిగా మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ సీఈఓ లీ-కా-షింగ్ సింగపూరియన్ కావడం గమనించాలి. వచ్చే సంవత్సరం నాటికి ల్యాబ్ చికెన్ కు పూర్తిస్థాయి మార్కెటింగ్ సౌలభ్యం కల్పిస్తామని, వచ్చే దశాబ్దం నాటికి కృత్రిమ మాంసాహారం ఒక ప్రత్యామ్నాయంగా రూపుదాలుస్తుందని ఈట్ జస్ట్ సంస్థ భావిస్తోంది.
Useful Links: https://www.scmp.com/business/companies/article/3114107/eat-justs-cell-grown-chicken-backed-li-ka-shings-horizons
ప్రపంచవ్యాప్తంగా శాకాహారం పట్ల అవగాహన పెరగడం, పర్యావరణ ఉద్యమాలు ఊపందుకోవడం, కోవిడ్ తరువాత జీవజాలం పట్ల సానుభూతి పెరగడం వంటి అనేక కారణాలతో కృత్రిమ మాంసం వైపు జనం ఆలోచన క్రమంగా మళ్లుతోంది. దీంతో కృత్రిమ మాంసాహారానికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
Comments
Post a Comment
Your Comments Please: