డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు.
IMP Story: దేవతా విగ్రహాల విధ్వంసం ఆగేదెపుడు?
IMP Story: జీవుల్ని చంపని మాంసాహారం వచ్చేసింది
పెళ్లిపెద్దలు: అన్నపూర్ణ-రాజ్‍కుమార్
సహ ఆహ్వానించినవారు: సరిత-రాము
కన్యాదాతలు: లక్ష్మి-సమ్మయ్య
లక్ష్మీనారాయణ చూపిన ఆప్యాయతే బాధ్యత తీసుకునేలా చేసింది
ఈ పెళ్లి బాధ్యతల గురించి రాజ్‍కుమార్ ఇలా వివరించారు. పెళ్లికూతురు తండ్రి లక్ష్మీనారాయణతో తనకు చిన్నప్పటి నుంచే సాన్నిహిత్యం ఉందని.. తాను, తన మిత్రులకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ హెడ్‍క్వాటర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ.. తాము యువకులుగా ఉన్నప్పుడు సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల మెలగాల్సిన పద్ధతుల గురించి చక్కగా చెప్పేవాడని, ప్రతి సంవత్సరం వినాయక చవితికి వంతులేసుకొని విగ్రహాలు తీసుకురావడం, అన్నప్రసాదాల బాధ్యతలు పంచుకోవడం గురించి లక్ష్మీనారాయణ ఒక కుటుంబ పెద్దలా ఉండి తమను సంఘటితం చేశాడని, ప్రతి వినాయక చవితిని ఘనంగా నిర్వహించేలా ప్రోత్సహించాడని చెప్పారు. ఆయన ఎంకరేజ్ చేసిన ప్రతి యువకుడు కూడా దేవుడి దయవల్ల అందరూ జీవితంలో చక్కగా సెటిలయ్యారని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. అలా లక్ష్మీనారాయణ ఇప్పుడు తమ మధ్య లేకపోయినా.. తమ కుటుంబాల మధ్య విడదీయరాని ఓ ఆత్మబంధంగా మారిపోయాడని, ఆ జ్ఞాపకాల గాఢత వల్లే సరితను కూతురిగా, చెల్లెలుగా భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని రాజ్‍కుమార్ చెప్పారు.
ఇక సహస్ర అక్క, బావ అయిన సరిత-రాము ఈ పెళ్లి కోసం బాగా శ్రమించారని, భారమని భావించకుండా అన్నింటికీ బాధ్యత వహించి, మహేశ్ తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందేలా లాంఛనాలు పూర్తి చేశారని, ఎక్కడా లోటు రాకుండా వ్యవహరించారని రాజ్‍కుమార్ చెప్పారు.
లక్ష్మీనారాయణ మూడో కూతురైన సహస్ర వివాహం కులాతీతంగా, హైందవ ధర్మాన్ని పూర్తిగా అనుసరించి జరగడంతో అందరూ సంతోషించడమే గాక కార్య నిర్వాహకులను అభినందించారు.
Comments
Post a Comment
Your Comments Please: