Skip to main content

గీ పట్నపోల్లకు ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా?

(పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి)

గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం పోటెత్తుతరు గావచ్చు అనుకున్నరు గదా. కనీ గసొంటి లెక్కలైతే యాడ నజర్ కు రాలే. అటు అమిత్ సారూ.. ఇటు అత్కార పార్టీ మంత్రులు, పెద్దపెద్ద లీడల్రు గల్లీలల్లనే టికానా వెట్టి అన్ని దగ్గరుండి సూస్కున్నరు. అయినా గూడ హైదరాబాద్ ఎలచ్చన్లు గింత అద్వానంగా తయారైనైయేంది? గీ ముచ్చటతోని పార్టీలన్ని గూడా పరేషాన్ల వడ్డయి. 

పల్లెలతోని టచ్చున్న పటాంచెరువసోంటి ఊర్లల్ల బగ్గనే పోలింగైంది. గీడ అమీర్ పేట, మాదాపూర్, కొండాపూర్ అసోంటి సాఫ్ట్ వేరోల్లు ఎక్వ మంది ఉండేకాడనేమో అద్వానంగా తయారైంది. పట్నంల సద్వుకున్న సార్ల తీరు జూసి అన్ని పార్టీల లీడల్రు గూడా.. ఇగ ఏడ్సుడొక్కటే తక్వవైతందాట. ఎందుకీల్లు గిట్ల తయారైండ్రు.. అన్ని గావాల్నంటరు... ఆకర్కు ఓటెయ్యరు.. ఓటెయ్యకపోతే ప్రజాస్వామ్యానికి అర్తమేంది? 20 శాతమో.. 30 శాతమో పోలైన పర్సెంటేజ్‍ను ప్రజాస్వామ్యం అన్జెప్పి సంకలు గుద్దుకొని సంబరపడ్దామా? గంత తక్వ పోలింగ్‍తోని మున్సిపల్ ఆపీస్ల గూసుండే లీడరు.. ఏంజేత్తె గాదాన్ని మనం అందరం ఆమోదించినట్టేనా? అండ్ల ప్రజాస్వామ్యం ఉన్నట్టేనా? గిసోంటి ఆలోశన్లు మేదావులల్ల, పార్టీలల్ల, ఎన్జీవోలల్ల మొదలైనయాట. మరి గసొంటప్పుడు తప్పకుంట ఓటేసే తీర్గ ఏమన్న కొత్త రూల్ దీస్కద్దామా? ఓటేసినోల్లకే నల్లా కనెచ్చను, ఓటర్ కారటు, రేషన్ కారటు ఉంటయని, లేకుంటే బంద్ జేత్తమని పెడ్తే ఎట్లుంటదీ.. అని గూడ సోచాయిస్తండ్రాట. మరి.. గీ ఎలచ్చన్ల ఎవల్ గెల్తరో సూసి.. రూలింగ్‍లకు వచ్చినోల్లు ఏం జేత్తరో సూద్దాం. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.