విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఖమ్మం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మను నియమించారు. ఆదివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథుల పుష్పగిరి చెప్పారు. అనంతరం ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తానని, విశ్వకర్మ సమాజపు పూర్వ వైభవానికి, సంస్కృతీ పరిరక్షణకు, సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్లవేళలా విశ్వకర్మలందరికి అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు. సాధించుకున్న తెలంగాణలో విశ్వకర్మలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలు సైతం విశ్వకర్మ సమాజానికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఎందరో విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని, తమ కుల సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని శ్రీనివాస్ విశ్వకర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వీవీఐఎస్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి, సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు శ్రీనివాస్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: