కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి లేక, పట్టించుకునేవారు లేక అల్లాడుతున్న నిరుపేద విశ్వకర్మలకు చేయూత అందించేందుకు వేదాస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి నాగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దనాచారి సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ శాఖ నాయకుడైన జైన్ కుమార్ ఈ సరుకుల పంపిణీ నిర్వహించారు. హైదరాబాద్ లో మూడు నిరుపేద కుటుంబాలను ఎంచుకొని వారికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు నగదు కూడా అందించారు. అంబర్ పేటకు చెందిన దివ్యాంగుడైన రవీందర్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు రూ. 2 వేల నగదు, వృద్ధులైన రెండు జంటలకు కూడా అదే తరహాలో నిత్యావసర సరుకులతో పాటు మొత్తం 7 వేల నగదును అందించారు.
వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రోత్సాహంతోనే తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, ఇందుకు సహకరించిన వేదాస్ సభ్యులు, నాయకులు అందరికీ జైన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర సహాయాధ్యక్షుడు కౌలే జగన్నాథం, అదే సంఘానికి చెందిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేశ్, ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సాయి, రాంచందర్ తదితరులు హాజరయ్యారు.
Comments
Post a Comment
Your Comments Please: